twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ముకుంద’ వివాదం: అర్థం కాక ఫ్యాన్స్ అయోమయం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య ప్రతి సినిమాపై ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. పలానా సినిమా తమ తమ మనోభావాలు తీసేలా ఉందని, తమ కులాన్ని కించ పరిచేలా ఉందని, తమ మతాన్ని అవమానించేలా ఉందని అంటూ ఏదో ఒక వివాదం ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం.

    తాజాగా విడుదలైన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రంపై కూడా వివాదం తలెత్తింది. ఈ సినిమా మనోభావాలు దెబ్బతీసేలా ఉందని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు.

    అయితే.....సినిమాలో యాదవులను కించ పరిచే సన్నివేశాలు ఏమున్నాయో అర్థం కావడం లేదని పలువురు అభిమానులు అయోమయంలో పడ్డారు. సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు ఏమున్నాయో నిశితంగా గమనించడానికి మళ్లీ సినిమా చూడటానికి సిద్ధమవుతున్నారు.

    Mukunda dispute, Fans confused

    ఫిర్యాదు వివరాలు...
    ఈ సినిమా యాదవులను కించపరిచే దృశ్యాలను చిత్రీకరించిన ముకుంద సినిమాను వెంటనే నిలిపివేయాలని శుక్రవారం తెలంగాణ యాదవ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణ సీఐ విజయ్‌కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భం గా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చర్ల మహేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ ముకుంద చిత్రంలో యాదవుల ను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని కోరారు. గతంలో ముకుంద సినిమాకు గొల్లభామ అనే పేరు పెట్టడాన్ని అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసారు.

    English summary
    Mukund dispute, Fans confused. A case has been registered in Siricilla police station towards the producers and director of Mukunda. Yadava group has slapped the case towards producers Tagore Madhu Nallamalapu Bujji, and director Srikanth Addala for allegedly displaying Yadava neighborhood in poor gentle within the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X