» 

వీరప్పన్‌ భార్య మొత్తం బయిటపెట్టేస్తానంటోంది

Posted by:

బెంగళూరు : ముత్తులక్ష్మి పేరుతో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జగ్గి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ముత్తులక్ష్మి కూడా ఓ పాత్రను పోషించనుంది. సినిమా వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ఈ వివరాలు విన్న వాళ్లు ఆమెను ఈ ప్రాజెక్టుకి ఎలా ఒప్పించగలిగారో అర్దమవుతోంది అంటున్నారు. పోలీసులు ఆమెపై చూపిన దాష్టీకం ఈ సినిమాలో చూపించే అవకాసం ఉందంటున్నారు.

'నా భర్త రాక్షసుడే. అందులో సందేహం లేదు. అయితే అతనిలో మంచి లక్షణాలూ ఉన్నాయి. వాటిని వెలుగులోకి రానీయలేదు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకవైపునే చూపాయి. అందుకే వాస్తవాలేమిటో ప్రపంచానికి తెలిపే ప్రయత్నమే 'ముత్తులక్ష్మి వైఫ్‌ ఆఫ్‌ వీరప్పన్‌ సినిమాకు ప్రేరణ అని' వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి వెల్లడించింది. ఇంతకీ ముత్తులక్ష్మి ఏం మాట్లాడిందో చదవండి.

ముత్తులక్ష్మి మాట్లాడుతూ... వీరప్పన్‌తో వివాహమయ్యే నాటికి తనకు 16 ఏళ్లని, అప్పటికి వీరప్పన్‌ అడవిదొంగ కాదన్నారు. గ్రామంలో పంచాయతీలు చేస్తూ అందరి మన్ననలు పొందాడన్నారు. మూడేళ్లపాటు తమ కాపురం సజావుగా సాగిందని, ఆ తరువాత పరిస్థితుల ప్రభావంతో వీరప్పన్‌ అడవిలోనే గడపాల్సి వచ్చిందని, అప్పుడప్పుడు కలుసుకునే దాన్నని తెలిపారు. వీరప్పన్‌ అనేకమంది పోలీసుల్ని హతమార్చాడు.

పోలీసులు కూడా అందుకు ప్రతిగా హత్యాకాండను కొనసాగించారని అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో మాత్రం వీరప్పన్‌ ఆగడాల్నే చూపారు. పోలీసుల దాష్టీకాన్ని చూపలేదు. అందుకే వాస్తవాల్ని ప్రపంచానికి తెలిపేందుకు ఈ సినిమాకు అంగీకరించాను. ఇందులో ఇప్పటి వరకు తెలియని వాస్తవ సంఘటనలు ఉంటాయి. కన్నడలో రూపొందించి అనంతరం తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన ఉందని చెప్పారు. ఇందులో ప్రముఖ నటి పూజాగాంధీ ముత్తులక్ష్మిగా, తమిళనటుడు రాజా వీరప్పన్‌ పాత్రను పోషిస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన అడవి దొంగ వీరప్పన్‌ భార్య పేరు ముత్తులక్ష్మి. ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ముత్తులక్ష్మి పాత్రను ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ పోషించనుంది. అంతేకాదు ఈ సినిమాకు ఆమె నిర్మాతల్లో ఒకరు. త్వరలోనే ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.

Read more about: veerappan, high court, muttu laxmi, arjun, వీరప్పన్, హై కోర్టు, ముత్తు లక్ష్మి, అర్జున్
English summary
Muthulakshmi says, “The day the STF (Special Task Force) took me in custody for two years after the death of Veerappan, I had decided that I would show people my version of the story someday. Back then, I didn’t even have the guts to speak to the media. I only knew that I was Veerappan’s wife with two kids. But there is more to me than that. Muthulakshmi will explore my life’s secrets.” On screen,
Please Wait while comments are loading...