» 

ఫోటో షూట్లో... పవన్ కళ్యాణ్ అత్త! (ఫోటోలు)

Posted by:

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ అత్త పాత్రలో నటించింది నటి నదియా. నదియా జెఎఫ్‌డబ్ల్యు(జస్ట్ ఫర్ ఉమెన్) మేగజైన్ కోసం కొన్ని రోజుల క్రితం ఫోటో షూట్లో పాల్గొంది. మిర్చి చిత్రంతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చిన నదియా....పవన్ స్టార్ సినిమాతో పెద్ద స్టార్‌గా మారి పోయింది. దీంతో ఆమోతో ఫోటో షూట్లకు పోటీ పడుతున్నాయి మేగజైన్లు.

ఒక టైంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను ఊపేసిన నదియా చాలా కాలం తర్వాత మళ్లీ బిజీ అయిపోతుంది. నదియా 'మిర్చి'లో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా చూసిన వారు నదియాకు ప్రత్యేకంగా మార్కులు వేశారు. దీంతో తెలుగులో మరో ఆఫర్ లభించింది.

నదియా ఇప్పుడు పవన్ కల్యాణ్ కు అత్తగా నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సమంతకు తల్లిగా నటిస్తుంది. ఇందులో కూడా ఆధునిక భావాలున్న మహిళగానే నదియా కనిపించనుందట. ఈ సినిమా తనకు మరింత గుర్తింపు తీసుకురావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తుంది. నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది.

తెలుగు తెరపై నదియా

తెలుగు తెరకి నాజూకు అందాలను పరిచయం చేసిన కథానాయికలలో నదియా ఒకరు. కుదురుగా కుందనపు బొమ్మలా కనిపిస్తూ, ఆనాటి కుర్రకారు ప్రేక్షకుల మనసులను ఆమె దోచేసుకుంది.

తెరకు దూరమైంది

అప్పట్లో క్రేజ్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుల జోడీగా నటించిన ఆమె, అగ్ర కథానాయికగా వెలుగొందడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే కేరియర్‌ ఇంకా స్పీడ్‌ అందుకోక ముందే ఆమె తెలుగు తెరకి దూరమైంది.

అమ్మ, అత్త పాత్ర

తమిళ, మలయాళ చిత్రలను ఎడాపెడా చేసినా ఆనాటి సౌందర్య రాశి ఇప్పుడు తల్లి, అత్త పాత్రలో అలరించడానికి రెడీ అయింది. ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మిర్చి' చిత్రంతో మెప్పించింది. త్వరలో పవన్ కళ్యాణ్‌కి అత్తగా తెరపై కనిపించబోతోంది.

మరిన్ని అవకాశాలు

నదియా మలయాళంలో కూడా రెండు సినిమాలను చేస్తుంది. ఆ సినిమాలలో కూడా నదియా ఆధునిక మహిళగానే కనిపించనుందట. ఇలా మొత్తానికి నదియ ఫుల్ బిజీగా మారింది.

See next photo feature article

పబ్లిసిటీ కోసమే మేగజైన్‌పై

మేగజైన్‌పై ఫోటో సూట్లలోపాల్గొనడం ద్వారా పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోందని, తద్వారా మరిన్ని అవకాశాలు రాబట్టుకునే అవకావం ఉంటుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరినదియా జోరు మున్ముందు ఎలా ఉండబోతోందో చూడాలి.

Read more about: pawan kalyan, samantha, nadiya, mirchi, పవన్ కళ్యాణ్, సమంత, త్రివిక్రమ్, ప్రణీత, నదియా, మిర్చి
English summary
Nadhiya cute Photoshoot for JFW Magazine. Nadhiya is a Malayalam and Tamil film actress who made her debut in a Malayalam movie named Nokketha Doorathu Kannum Nattu, alongside Mohanlal and Padmini. She has also acted in a few Telugu films.
Please Wait while comments are loading...