twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షార్ట్ ఫిలిం తెగ నచ్చేసి నాగార్జున ఇలా....(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: తన మనస్సుకు నచ్చినది ఏదైనా ప్రమోట్ చేయటానికి వెనకాడని వ్యక్తిత్వం నాగార్జున సొంతం. ఆయనకు రీసెంట్ గా స్వచ్చ భారత్ పోగ్రాంపై చేసిన ఓ షార్ట్ ఫిలిం నచ్చేసింది. కమిడియన్ అంబటి శ్రీనివాస్ చేసిన షార్ట్ ఫిలిం ని చూసిన ఆయన దాన్ని ప్రమోట్ చేయటానికి ముందుకు వచ్చారు. ఈ వీడియోలో మీరు నాగార్జున ఆ షార్ట్ ఫిలింను గురించి చెప్పే మాటలను చూడవచ్చు.

    ఈ షార్ట్ ఫిలిం చేసిన అంబటి మాట్లాడుతూ..."నేను చేసిన ఈ షార్ట్ ఫిలిం లో భూమని తల్లితో పోల్చాను. తొమ్మిది నెలలూ ఓ తల్లి తన బిడ్డలను గర్బంలో మోసినట్లే... భూమాత కూడా మనందరినీ మోస్తోంది. మనం మన తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో..అలాగే భూమాతను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన భాధ్యత ఉంది. ఈ షార్ట్ ఫిలిం గురించి తెలిసిన వెంటనే నాగార్జున గారు తన రికార్డింగ్ స్టూడియోకు పిలిపించుని మెచ్చుకున్నారు. ఆయన నా వర్క్ కు చాలా ఇంప్రెస్ అయ్యారు. దీన్ని నేను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నాను... దీని మూలంగా వచ్చే రెవిన్యూ మొత్తం వైజాగ్ తుఫాన్ భాధితులకు డొనేట్ చేయటం జరుగుతుంది ." అన్నారు.

    ఇంతకీ ఆ షార్ట్ ఫిలిం ఎలా ఉంటుందో మీకూ చూడాలని ఉందా..ఇదిగో.. ఇక్కడ

    ఇక కొద్ది రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబం 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆవరణను వారు శుభ్రం చేశారు.

    Nag impressed with short film on Swacch Bharat

    అంతేకాదు ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొనేలా చేసారు. 'స్వచ్ఛ భారత్‌'లో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ప్రముఖుల్లో అనిల్‌అంబానీ ఒకరు. ప్రధాని మోదీ పిలుపుమేరకు అక్కినేని కుటుంబం 'స్వచ్ఛభారత్‌'లో మమేకమైంది. సినీనటుడు అక్కినేని నాగార్జునతోపాటు అమల, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌, నాగసుశీల తదితరులు చీపుర్లు పట్టుకుని అన్నపూర్ణ స్టూడియో ఆవరణను శుభ్రం చేశారు.

    నాగార్జున మాట్లాడుతూ...మనమంతా రోజూ రెండు గంటల సమయాన్ని కేటాయించి.. మన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తే స్వచ్ఛభారత్‌ సాకారమవుతుందన్నారు. అంతేకాదు...ఈ కార్యక్రమస్ఫూర్తితో నాగ్‌4స్వచ్ఛభారత్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని.. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న ఔత్సాహికులు తమ ఫొటోలను పంపితే అందులో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. అభిమానులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నాగార్జున కోరారు.

    నాగార్జున కంటిన్యూ చేస్తూ... ''ప్రధాని స్వచ్ఛ భారత్‌ కోసం ఇచ్చిన పిలుపును అందుకుని సచిన్‌, అనిల్‌ అంబానీ, సానియా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో ఒక గంటో, రెండు గంటలని కాకుండా ఈ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని కేటాయించి మన ఇంటినే కాకుండా పరిసరాలను క్లీన్‌ చేస్తే స్వచ్ఛ భారత్‌ను మనం చూడవచ్చు.

    భారత ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్‌'పేరుతో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనటం ఖచ్చితంగా స్పూర్తిని ఇస్తుందంటున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేయాలని కోరుతున్నాను అని నాగార్జున పిలుపు ఇచ్చారు.

    స్వచ్ఛభారత్‌ ఆవిష్కరణ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు నాగార్జున కృషి మరింత దోహదపడుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా..అక్కినేని అఖిల్ సైతం చీపురు పట్టారు. తామంతా స్వచ్చ భారత్ కు కట్టుబడి ఉంటామని అందరూ ప్రతిజ్ఞ ని నాగార్జున అద్వర్యంలో చేసారు.

    మరో యువ హీరో, అక్కినేని కుటుంబ వారసుడు నాగ చైతన్య కూడా చీపురు పట్టుకుని స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో బిజీగా ఉండే అక్కినేని అమల ఈ స్వచ్చ భారత్ కార్యక్రమంలోనూ కుటుంబంతో కలిసి పనిచేసారు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం తమ అన్నపూర్ణ స్టూడియో ఎంప్లాయిస్ తో కలిసి పనిచేయటం ఉద్యోగులలో ఉత్తేజం నింపింది.

    English summary
    Comedian Ambati Srinivasa Rao came with a short film on Swacch Bharat and it impressed none other than Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X