twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సంఘటనతో అమల తనని ఎంత ప్రేమిస్తోందో నాగ్ కు అర్దమైందిట

    అమల తనని ఎంత ప్రేమిస్తోందో అర్దమైందన్న నాగార్జున.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''సినిమా చూసిన తర్వాత నన్ను గంటసేపటి వరకు వదల్లేదు అమల. నా చేయి పట్టుకొనే కూర్చుంది. మేం ప్రేమించుకొనేటప్పుడు, పెళ్లైన కొత్తలో అలా జరిగేది. మళ్లీ అప్పటి అనుభూతులు గుర్తుకొచ్చాయి. తను నన్నెంతగా ప్రేమిస్తోందన్నది 'ఓం నమో వేంకటేశాయ' చూసిన తర్వాత మరోసారి అర్థమైంది'' అన్నారు నాగార్జున.

    విభిన్నమైను చిత్రాలు చేస్తూ యంగ్ హీరోలకు ధీటుగా నిలబడుతున్న సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున రీసెంట్ గా చేసిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం మొన్న శుక్రవారం విడుదలై అంతటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంటోంది. రాఘవేంద్ర రావు, నాగార్జున ల కలయికలో వస్తున్న చిత్రం కావడం వలన మొదటి నుండీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే చిత్రం ఉందని చూసిన ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

    'ఓం నమో వేంకటేశాయ'. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వచ్చిన చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. శ్రీవారి భక్తుడు 'అన్నమయ్య'గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడో చూద్దామని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

     నాలా చాలా మార్పులొచ్చాయి

    నాలా చాలా మార్పులొచ్చాయి

    నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య'ని ఆదరించినట్టే ఈ సినిమానీ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇది సాధ్యం కావడానికి ప్రధాన కారణం రాఘవేంద్రరావుగారు. ‘అన్నమయ్య'తో ఒక ఆధ్మాత్మిక ప్రయాణం మొదలైంది. అప్పట్నుంచి మానసికంగానూ నాలో చాలా మార్పులొచ్చాయి. దానికి కారణం కె.రాఘవేంద్రరావుగారే.

     ఏడిపించేసావు నాగ్ అన్నారు

    ఏడిపించేసావు నాగ్ అన్నారు

    మూడు నాలుగేళ్లపాటు తయారు చేసిన కథతో ‘ఓం నమో వేంకటేశాయ' తెరకెక్కింది. ఆ స్థాయి భావోద్వేగాలతో సినిమా తెరకెక్కిందంటే దాని వెనకాల రాఘవేంద్రరావుగారు, రచయిత భారవి పడిన కష్టం ఉంది. కీరవాణి తన సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు. ఆయనకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా చూసి చిరంజీవిగారు చాలా మెచ్చుకొన్నారు. ‘నన్ను ఏడిపించేశావ్‌ నాగ్‌' అని జేబులోంచి టిష్యూ పేపర్లు తీసి చూపించారు'' అన్నారు.

     ఇదో పెద్ద బహుమతి

    ఇదో పెద్ద బహుమతి

    నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. నాగార్జున అభిమానులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇదో పెద్ద బహుమతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మంచి సినిమా తీశారని అభినందిస్తుంటే ఈ జీవితానికి ఇది చాలనిపిస్తోంది. తిరుపతి కొండమీద జరిగే విశేషాలు యువతరానికి తెలియజెప్పిన చిత్రమిది. రెండు గంటలపాటు వెండితెరపై వెంకటేశ్వరస్వామిని చూసిన అనుభూతి కలుగుతుంది'' అన్నారు.

    ప్రగ్యాజైస్వాల్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశా. పతాక సన్నివేశాల్లో కళ్లల్లో నీళ్లు తిరిగాయి'' అన్నారు.

     అదే అనుభూతి ప్రేక్షకులకు

    అదే అనుభూతి ప్రేక్షకులకు

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఏం ఆశించి ఈ సినిమా తీశామో అది నెరవేరింది. సినిమా తీసేటప్పుడు నేను ఎలాంటి అనుభూతికి లోనయ్యానో, అదే అనుభూతికి ప్రేక్షకులు లోనవుతున్నారు. నా జన్మ ధన్యమైందని ఎప్పుడో కానీ చెప్పం. ఈ సినిమాతో నిజంగానే నా జన్మధన్యమైంది.

     చెప్పలేదో లెక్కే లేదు

    చెప్పలేదో లెక్కే లేదు

    మామూలుగా ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిని చూస్తే విగ్రహం కనిపిస్తుంది. అదే నాగార్జున కళ్లతో చూస్తే దివ్య దర్శనం కలుగుతుంది. నిజంగానే రెండు కళ్లతో విశ్వరూప దర్శనం చూపించాడు. నాగ్‌ మాత్రమే చేయగలిగే పాత్ర ఇది. శ్రీరామదాసు చేస్తున్నప్పుడు రెండు మూడు సార్లు మాత్రమే సెట్‌లో కట్‌ చెప్పలేకపోయా. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు కట్‌ చెప్పలేదో లెక్కే లేదు అన్నారు రాఘవేంద్రరావు.

     అమల తట్టుకోగలదా అనుకున్నా

    అమల తట్టుకోగలదా అనుకున్నా

    క్లైమాక్స్ తీస్తున్నప్పుడు ‘ఈ సన్నివేశాన్ని చూసి అమల తట్టుకోగలదా?' అని సందేహమేసింది. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ఇంకొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకిన వెంటనే ప్రతిస్పందిస్తాం. అలాంటి సన్నివేశమే ఇది. ఈ సినిమాని నేను చేయలేదు, ఆ స్వామే చేయించాడు'' అన్నారు.

    సినిమా ఎలా ఉంది

    సినిమా ఎలా ఉంది

    నాగ్, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో ప్లస్ లు ఏమిటి..మైనస్ లు ఏమిటి అనే విషయాలు క్రింద రివ్యూలో చదవండి.భక్తులకు పండగయా!!(‘ఓం నమో వేంకటేశాయ' రివ్యూ)

    English summary
    Speaking at the success meet of Om Namo Venkatesaya , Nagarjuna revealed that his wife Amala was so impressed with the movie and especially the climax that she sat down speechless after coming home, held Nag’s hands and kept staring at his eyes for more than an hour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X