»   » అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య

అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్... అక్కినేని ఫ్యామిలీ నుండి వెండితెరపైకి దూసుకొచ్చిన యంగ్ తరంగ్. అఖిల్ 20వ ఏట అడుగు పెట్టగానే అతడు హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడనే విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయం ఖరారైన ఏడాదిలోగా ఈ కుర్రస్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు.

అయితే తొలి సినిమా బాక్సాపీసు వద్ద బోల్తా పడటం అభిమానులను కాస్త షాక్ కు గురి చేసింది. అయితే ఈ షాకింగ్ వార్త విన్న కొన్ని నెలలకే మరో షాకింగ్ న్యూస్. అదే అఖిల్ ప్రేమ విషయం. మొత్తానికి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి కూడా సిద్ధ మయ్యాడు. శ్రీయ భూపాల్ అనే అమ్మాయితో అఖిల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

నాగార్జున, చైతన్య కూడా షాక్

అఖిల్ ప్రేమ విషయం మనకే కాదు... నాగార్జున, నాగ చైతన్యలను కూడా షాక్ కు గురి చేసిందట. తొలుత ఈవిషయం విని నాన్నగారు, నేను షాకయ్యాం అంటూ ఇటీవల నాగ చైతన్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

లవ్ బాంబు పేల్చాడు

అఖిల్ ప్రేమలో పడిన విషయాన్ని నాన్న కూడా ఊహించలేదు. ఒకరోజు ఉన్నట్లుండి న్యూక్లియర్ బాంబు పేల్చినట్లు ప్రేమ విషయం చెప్పాడంటూ నాగ చైతన్య సరదాగా వ్యాఖ్యానించారు.

అఖిల్ నిర్ణయంపై హ్యాపీ

ఇది ఊహించని అంశమే అయినా....అఖిల్ చాలా తక్కువ టైమ్ లో తన ప్రేమ విషయమై నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమే.... కుటుంబ సభ్యులంతా అఖిల్ నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు అని నాగ చైతన్య తెలిపారు.

అఖిల్ పెళ్లి తర్వాతే నా పెళ్లి

సమంతతో నా పరిచయం స్నేహంగా మారిందని, ఇద్దరం ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాగ చైతన్య తెలిపారు. అఖిల్ ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ముందు అఖిల్ పెళ్లి జరుగుతుందని నాగ చైతన్య తెలిపారు. ఇద్దరి వివాహం ఒకే వేదికపై జరుగే చాన్సే లేదని చైతన్య తెలిపారు.

వచ్చే ఏడాది మా వివాహం

నేను, సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాం. ఇంకా ముహూర్తాలు ఫిక్స్ కాలేదు. ముహూర్తాలతో పాటు అన్ని కలిసి రావడంతో అఖిల్ వివాహం నాకంటే ముందు జరుగుతోంది అంతే తప్ప మరేమీ లేదని చైతన్య తెలిపారు.

సమంత మా ఫ్యామిలీతొ బాగా కలిసింది

ఏమాయ చేసావే సినిమా సమయంలో సమంతతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ‘మనం' చిత్రం అప్పటి నుంచే సమంత తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందని తెలిపారు నాగ చైతన్య.

పెళ్లి తర్వాత కూడా సమంత

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగుతుందని, హీరోయిన్ గా నటిస్తుందని నాగ చైనత్య తెలిపారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు నచ్చిన పని చేయడానికి తాను అడ్డు చెప్పనని తెలిపారు.

సమంత మతం గురించి

నాగ చైతన్య స్పందన సమంత మతం మార్చుకుందనే వార్తలపై నాగ చైతన్య స్పందించాడు. ఈ వార్తలు రావడానికి కారణమైన సదరు ఫోటోలపై కూడా చైతూ వివరణ ఇచ్చాడు. మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం, తమకు అలాంటి అవసరం కూడా లేదని స్పష్టం చేసాడు.

ఆ ఫోటోస్ ఏమిటి?

సమంత మతం మార్చుకున్నట్లు ప్రచారమవుతున్న ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో పూజకు సంబందించినవే తప్ప... మతం మార్చుకోవడాల్లాంటివేమీ జరుగలేదని నాగ చైతన్య స్పష్టం చేసారు. దీనిపై అనవసర రాద్దాందం చేయొద్దన్నారు.

ఇంకా ఏదీ జరుగలేదు

నిశ్చితార్థం జరుగేలేదు కొందరు ఈ ఫోటోలు చూసి మాకు నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. అందులో కూడా వాస్తవం లేదు. మాకు నిశ్చితార్థం జరుగలేదు, సమంత మతం కూడా మార్చుకోలేదు.... మేము పెళ్లి చేసుకుంటున్నాం అని ప్రకటించాం. అలాంటపుడు నిశ్చితార్థం రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాగ చైతన్య తేల్చి చెప్పారు.

అలాంటి పట్టింపులు

మతం పట్టింపులు లేవు మా ఇద్దరికీ మతం పట్టింపులు లేవు. మాలో అలాంటి ఉద్దేశ్యం ఉంటే మా బంధం మేము ఇక్కడికి వరకు వచ్చేదే కాదు. మాకు ఏ మతమైనా ఓకే అని. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం, గౌరవించడం చేస్తాను తప్ప మతం మార్చుకోమనడమో, ఇంకేదో లాంటి కండిషన్స్ పెట్టనని చైతు స్పష్టం చేసారు.

వేరే అమ్మాయిని ఊహించుకోలేదు

సమంత తప్ప వేరే అమ్మాయి గుర్తు రాలేదు మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.

అతని కంటే పెద్ద తీవ్రవాది లేడు: స్టార్ హీరోపై పోసాని కామెంట్స్

అతని కంటే పెద్ద తీవ్రవాది లేడు: స్టార్ హీరోపై పోసాని కామెంట్స్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Naga Chaitanya about Akhil love marriage. Akhil Akkineni, younger son of Telugu megastar Nagarjuna, will get engaged to city-based designer Shriya Bhupal here on December 9.
Please Wait while comments are loading...