twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దోచేయ్‌' డివైడ్ టాక్ పై నాగ చైతన్య

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాకిది కొత్త కథ. క్రైమ్‌ కామెడీ అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. సుధీర్‌ వర్మ 'స్వామి రా రా'తో ఇదే జోనర్‌ టచ్‌ చేశాడు. దాంతో ఇద్దరం మళ్లీ ఆ తరహా కథనే ఎంచుకొన్నాం. తొలిరోజు మిశ్రమ స్పందన లభించిన మాట వాస్తవమే. కానీ... ఆ తరవాత నిలబడిపోయింది అంటున్నారు నాగచైతన్య. ఆయన తాజా చిత్రం 'దోచేయ్‌' రీసెంట్ గా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే... 'దోచేయ్‌' లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువగా ఆశించకూడదు. నిజాయతీగా పనిచేయాలి. ఎందుకంటే ఇది మామూలు కమర్షియల్‌ చిత్రం కాదు. ఆరు పాటలు, ఐదు ఫైట్లూ అనే ఫార్ములాతో ఈ సినిమా తీయలేదు. మెల్లమెల్లిగా జనంలోకి వెళ్తుందన్న సంగతి ముందే తెలుసు అన్నారు.

    ఇక ''దోచేయ్‌.. టైటిల్‌ గురించి అందరూ అడుగుతున్నారు. నన్నందరూ 'చేయ్‌' అని పిలుస్తారు. అందుకే ఆ పేరు పెట్టామనుకొంటున్నారు. అదేంకాదు.. కథకు 'దోచేయ్‌' బాగా నప్పింది. ఆ తరవాత టైటిల్‌లో నా పేరు ఉందని తెలిసిందంతే అన్నారు.

    Naga Chaitanya on Dochay's Divide talk

    ఈ సినిమా చేయటానికి కారణం చెప్తూ... ''సినిమా సినిమాకీ నటుడిగా నాలో మార్పు కనిపించాలి. నాకు తెలిసి అదే ఎదుగుదల. 'దోచేయ్‌' ఆ అవకాశం కల్పించింది. గత రెండేళ్లలో ప్రేక్షకులు చాలా మారారు. కొత్తరకం కథల్ని ఆదరిస్తున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కథల్ని ఎంచుకోవాల్సిందే. మల్టీప్లెక్స్‌ సంస్కృతి కూడా బాగా పెరుగుతోంది. ఈ సందర్భంలో ఇలాంటి కథలకు ఆదరణ బాగుంటుందనిపించింది అని చెప్పుకొచ్చారచు.

    అయినా.... ''క్లాస్‌ మాస్‌ తేడా నాకు తెలీదు. ఎక్కువమంది చూస్తే అది మాస్‌ సినిమా. ఏ కొందరికో చేరువైతే అది క్లాస్‌. కానీ అందరికీ నచ్చే కథలు ఎంచుకోవాలన్నదే నా అభిమతం. అలాగని ప్రయోగాలు మానేయకూడదు. ఏడాదికి ఒక్కసారైనా కొత్తగా ప్రయత్నించాలి. రిస్క్‌ తీసుకోవడంలో తప్పు లేదు. అప్పుడే మన ప్రతిభ బయటపడుతుంది. 'గీతాంజలి', 'శివ' తీసేటప్పుడు నాన్నగారు రిస్క్‌ అనుకోలేదు. అవే ఆయన కెరీర్‌ని మలుపుతిప్పాయి'' అని చెప్పారు.

    ఫైనల్ గా... ''ప్రతిభావంతులైన కొత్త హీరోలు వస్తున్నారు. వాళ్ల మధ్య మనదైన మార్క్‌ చూపించాలంటే కష్టపడాల్సిందే. నాన్నగారు, తాతగారూ ఓ మార్క్‌ సృష్టించారు. ఓ మంచి కుటుంబం నుంచి వచ్చానన్న సంగతి ఎప్పుడూ గుర్తుంటుంది. దాంతో పాటు ఒత్తిడీ ఉంటుంది. మంచి కథల్ని, ఈ తరం అభిరుచుల్ని అందుకొనే సినిమాల్ని ఎంచుకోవడమే నేను చేయగలిగింది. సినిమా సినిమాకీ నేర్చుకొంటూనే ఉండాలి. అది ఎప్పుడు ఆపేస్తామో మన ఎదుగుదల అప్పుడు ఆగిపోయినట్టు లెక్క'' అంటున్నాడు నాగచైతన్య.

    ''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

    English summary
    Naga Chaitanya said that he know that Dochay will get Divide talk first. Nagachaithanya came along with Kriti Sanon to ‘Dochay’ the hearts of Akkineni fans and movie lovers on 24th April with the music of Sunny.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X