twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీసెంట్ లవ్ స్టోరీ ('ఒక లైలా కోసం' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: తమ వయస్సుకు తగ్గ ప్రేమ కథలను ఎంచుకోవటంలో యంగ్ హీరోలంతా బిజీగా ఉన్నారు. యాక్షన్ చిత్రాలు బోల్తా కొట్టడంతో యూత్ రొమాంటిక్ స్టోరీలను ఎంచుకుని సక్సెస్ అవుతున్నారు. అదే రూటులో మనంతో హిట్ కొట్టిన నాగ చైతన్య ...ఈ సారి రొమాంటిక్ కామెడీతో ఈ రోజు ముందుక వస్తున్నాడు. నితిన్ తో గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం హిట్ తో తిరిగ ఫామ్ లోకి వచ్చిన కొండా విజయ్ కుమార్ దర్శకుడు కావటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

    ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందన(పూజా హేడ్గే) ను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

    Naga Chaitanya's Oka Laila Kosam movie preview

    ''అన్నపూర్ణ స్డూడియోస్‌ సంస్థ నుంచి ఇంటిల్లిపాదీ నచ్చే సినిమాలే తీశాం. 'నిన్నేపెళ్లాడతా', 'మన్మథుడు' లాంటి కుటుంబ కథా చిత్రాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. 'ఒక లైలా కోసం' కూడా ఆ జాబితాలో చేరే సినిమా అవుతుంద''న్నారు నాగార్జున.
    నాగచైతన్య, పూజాహెగ్డే జంటగా నటించారు. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈసందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

    నాగార్జున మాట్లాడుతూ ''నాగచైతన్య కెరీర్‌లో చాలామంచి సినిమా అవుతుంది. తనకు రొమాంటిక్‌ ఇమేజ్‌ తొలి సినిమాతోనే వచ్చేసింది. 'ఒక లైలా కోసం'తో అది నిలబడిపోతుంది. విజయ్‌కుమార్‌ కొండా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ బాగా పండాయి. అనూప్‌ పాటలకూ మంచి స్పందన వస్తోంద''న్నారు. ''ఇదో ఫీల్‌గుడ్‌ సినిమా. విశ్రాంతికి ముందొచ్చే సన్నివేశం నాకు బాగా నచ్చింద''ని నాగచైతన్య తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''కార్తీక్‌ అనే ఓ మజ్నూ కథ ఇది. ప్రేమించిన అమ్మాయికి ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వలేని బహుమతి ఇస్తాడు. అలీ పాత్ర నవ్వులు పండిస్తుంద''న్నారు. ''నిజానికి నాకు రీమిక్స్‌ అంటే భయం. పాత పాటని చెడగొట్టేస్తానేమో అని కంగారు పడుతుంటా. కానీ ఈ సినిమాలో 'ఒకలైలా కోసం' పాట బాగా వచ్చింద''ని అనూప్‌ తెలిపారు.

    బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
    నటీనటులు: నాగ చైతన్య, పూజ హేడ్గే, అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు
    కెమెరా: ఐ.ఆండ్రూ,
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి,
    ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌,
    నిర్మాత: అక్కినేని నాగార్జున,
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.
    విడుదల తేదీ : 17,అక్టోబర్ 2014.

    English summary
    Director Vijay Kumar Konda's new flick Oka Laila Kosam is a romantic entertainer which has been creating good ripples in social media for a long time. Naga Chaitanya and actress Pooja Hegde are playing the lead roles in the movie, which has hit the marquee today (October 17).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X