twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, మహేష్, ప్రభాస్ కంటే తారక్ ముందు అంటున్న నాగార్జున

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఇపుడున్న హీరోల్లో 30 ఏళ్లకు ముందు స్టార్ డమ్ వచ్చిన వాళ్లు తక్కువే... తారక్ కు అందరికంటే ముందు వచ్చింది అంటున్నారు నాగార్జున. 'ఊపిరి' సినిమాలో తొలుత కార్తి స్థానంలో జూ ఎన్టీఆర్ ను అనుకున్నాం, కానీ తనకు కాల్షీట్లు కుదరలేదు. తర్వాత కార్తీని తీసుకున్నామని నాగార్జున మీడియాకు తెలిపారు.

    కార్తీకి సూర్య ఎంతో నేనూ అంతే. అంత గౌరవంగా, ఆప్యాయంగా చూసుకుంటాడు. ఈ సినిమాకు తమిళంలో నేనే డబ్బింగ్‌ చెప్పాను. నటుడిగా కొనసాగడం నాకిష్టం. సినిమాలు చేస్తూనే ఉంటాను. కొన్ని సార్లు మంచి పాత్రలు అనిపించినప్పుడు కొన్నిటిని పక్కనపెట్టడానికి కూడా వెనకాడను. మీ పిల్లలతో పోటీపడుతున్నారా? అని అడుగేవాళ్ళున్నారు. వాళ్ళు నాకెప్పుడూ పోటీ కాదు అన్నారు నాగార్జున.

    వాళ్ళకి కూడా ఎప్పుడూ ఒకటే చెబుతుంటా. మంచి స్ర్కిప్ట్‌లను ఎంపిక చేసుకుని నటిస్తే స్టార్‌డమ్‌ అదే వస్తుంది అని. మన దగ్గర 30 ఏళ్ళకు ముందు స్టార్‌డమ్‌ వచ్చిన వాళ్ళు తక్కువే. తారక్‌కి త్వరగా వచ్చింది. మహేష్‌, ప్రభాస్‌, పవన కల్యాణ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి 30ఏళ్ళ తర్వాతే స్టార్‌డమ్‌ వచ్చింది అన్నారు నాగ్.

    స్లైడ్ షోలో నాగార్జున చెప్పిన మరిన్ని వివరాలు...

    ఊపరిలో తన పాత్ర గురించి..

    ఊపరిలో తన పాత్ర గురించి..


    ఊపిరిలో నా పాత్ర కింగ్‌లాగా ఉంటుంది. ఒక రేంజ్‌లో ఉన్న బిలీనియర్‌ కేరక్టర్‌ అది. వీల్‌ చెయిర్‌లో కూర్చున్న పేషంట్‌లాగా ఎక్కడా అనిపించడు. లైవ్లీగా ఉంటాడు. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఉంటుంది. అదేంటన్నది సస్పెన్స్ అన్నారు నాగ్.

    కార్తి

    కార్తి


    వీల్ చెయిర్ లో కూర్చున్న వ్యక్తికి మంచి తోడు శీను అనే పాత్ర ద్వారా లభిస్తుంది. శీను స్లమ్‌ నుంచి వచ్చిన కుర్రాడు. ఆ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు అన్నారు నాగార్జున.

    ఇన్ టచబుల్స్

    ఇన్ టచబుల్స్


    నేను ‘ఇన్‌టచబుల్స్‌'ను నాలుగేళ్ళ క్రితం చూశాను. ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే బావుంటుందని అనుకున్నా. వంశీ, పీవీపీ వచ్చి అదే కథను నాకు చెప్తారని నేను ఊహించలేదు అన్నారు.

    చైతు, అఖిల్ వద్దన్నారు

    చైతు, అఖిల్ వద్దన్నారు


    వీల్‌ చెయిర్‌లో కూర్చునే పాత్ర అనగానే ముందు చైతూ, అఖిల్‌ వద్దన్నారు. అంతెందుకు అమల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌'లో కేన్సర్‌ పేషెంట్‌లాగా చేస్తానంటే ముందు నేనూ వద్దన్నాను అని నాగార్జున చెప్పుకొచ్చారు.

    ఇపుడు అమల

    ఇపుడు అమల


    ఇప్పుడు నా సినిమాను చూడటానికి అమల ధైర్యాన్ని కూడగట్టుకోవాలని అంటోందని నాగ్ తెలిపారు.

    ఫ్యాన్స్

    ఫ్యాన్స్


    సినిమా చూశాక తనే కాదు, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతారు. చూసిన ప్రతివారు తమ జీవితాల్లో ఎవరో ఒకర్ని గుర్తుచేసుకుంటారు అన్నారు.

    వంశీ ఏడ్చాడు

    వంశీ ఏడ్చాడు


    నేనీ మధ్య సినిమా చూశా. వంశీ నా రెస్పాన్స్‌ని చూసి ఏడ్చేశాడు. ఇదీ వంశీ మార్కు సినిమా అని చెప్పుకునేంత బాగా వచ్చింది అన్నారు.

    ప్రయోగాత్మక చిత్రం కాదు...

    ప్రయోగాత్మక చిత్రం కాదు...


    ఎన్టీఆర్‌గారు, ఏఎన్నార్‌గారు గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ఈ మధ్య మన దగ్గర గ్యాప్‌ వచ్చింది. ఇది నా దృష్టిలో ప్రయోగాత్మక చిత్రం కాదు. ఇలాంటి పాత్ర పోషించడం నా అదృష్టంగానే భావిస్తా

    English summary
    Akkineni Nagarjuna, Karthi, Tamannaah starring Oopiri Movie Latest Stills. Directed by Vamsi Paidipally and Produced by Prasad V Potluri. Music by Gopi Sunder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X