twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ కు ఖరీదైన గుణపాఠం

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'మనం' కాదు... 'భాయ్‌'తోనే నాలో మార్పు మొదలైంది. ఎలాంటి కథలు చేయాలో, ఎలాంటి కథలు చేయకూడదో ఆ ఫలితమే తేల్చి చెప్పింది. 'భాయ్‌' విషయంలో నేనెవ్వరినీ నిందించడం లేదు. తప్పంతా నాదే. ఎందుకంటే నా నిర్ణయం మేరకే ఆ సినిమా పట్టాలెక్కింది. అయితే ఆ అనుభవం ఖరీదైన గుణపాఠంగా మిగిలిపోయింది అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. శుక్రవారం నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు ఇలా చెప్పుకొచ్చారు.

    'మనం', 'దృశ్యం'లాంటి సినిమాలు చూస్తుంటే.. పరిశ్రమ మరో మలుపు తీసుకొన్నట్టే అనిపిస్తోంది.. అదంతా స్క్రిప్ట్‌ల ప్రభావం. కేవలం కథలే ఈ సినిమాల్ని నడిపించాయి. మంచి కథలొస్తే మాలాంటి కథానాయకులు ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించడానికి సిద్ధమవుతాం. 'దృశ్యం' చూశా. చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌ సీన్‌ చూడండి. అందులో వెంకటేష్‌ దెబ్బలు కూడా తింటాడు. నిజానికి అలాంటి సన్నివేశాలు తెలుగు సినిమాల్లో చూడడం కష్టం. హీరో దెబ్బలు తినడం ఏంటి అంటారు అన్నారు.

    Nagarjuna again about Bhai Movie

    తండ్రిని తలుచుకుంటూ...అయితే ఈ యేడు ఎప్పటికీ మర్చిపోలేను. యేడాది ప్రారంభంలోనే నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ 'మనం'లాంటి ఓ మధురమైన కానుక ఇచ్చారాయన. ప్రతి పుట్టిన రోజూ అభిమానుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడం అలవాటు. అయితే ఈ యేడాది సంబరాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నా అన్నారు.

    'ఒక లైలా కోసం' గురించి మాట్డాలుడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.

    English summary
    Nagarjuna said that Bhai movie gave a lesson which is a good story and a bad Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X