»   » చైతూ, అఖిల్, నాగ్ కలిసి ఎంజాయ్ చేస్తూ.. (ఫోటోలు)

చైతూ, అఖిల్, నాగ్ కలిసి ఎంజాయ్ చేస్తూ.. (ఫోటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాలు, టీవీ షోలు, అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన వ్యవహారాలతో బిజీగా ఉండే నాగార్జున ప్రస్తుతం తన ఇద్దరు కుమారులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుల్లో స్కూబా డైవింగుకు వెళ్లే ముందుకు తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫోటోను నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

Nagarjuna and Akhil, Naga Chaitanya Caught in Maldives

నాగార్జునకు సంబంధించిన సినిమాల వివరాల్లోకి వెళితే....ప్రస్తుతం ఆయన 'ఊపిరి' చిత్రంలో నటిస్తున్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ఇది.

షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 10న ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య, యూత్‌ కింగ్‌ అక్కినేని అఖిల్‌ 'ఊపిరి' ట్రైలర్‌ను విడుదల చేశారు.

కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌,పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి,సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బ ంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి. పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Nagarjuna and Akhil, Naga Chaitanya Caught in Maldives

Nagarjuna and Akhil, Naga Chaitanya Caught in Maldives

Nagarjuna and Akhil, Naga Chaitanya Caught in Maldives

English summary
Nagarjuna, Naga Chaitanya and Akhil are right now enjoying their stay in Maldives.
Please Wait while comments are loading...