»   » వెడ్డింగ్ బెల్స్ : అఖిల్ ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన నాగార్జున

వెడ్డింగ్ బెల్స్ : అఖిల్ ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన నాగార్జున

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని వారి ఇంట్లో త్వరలో వెడ్డింగ్ బెల్స్ మ్రోగబోతున్నాయంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు నాగ చైతన్యతో పాటు ఇటు అఖిల్ కూడా ప్రేమలో పడటం, తమకు కాబోయే జీవిత భాగస్వాములను వారే స్వయంగా ఎంచుకోవడం తెలిసిందే.

నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య తన సహచర నటి సమంతను తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇక అఖిల్ తన స్నేహితురాలు శ్రీయ భూపాల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వివాహం సందర్భంగా...... చైతన్య-సమంత జంటను అందరికీ పరిచయం చేయడం ద్వారా నాగార్జున్ వీరి విషయాన్ని అఫీషియల్ చేసాడు.

తాజాగా తన చిన్న కుమారుడు అఖిల్‌కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు నాగ్. డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు. వివాహం 2017లో ఉంటుందన్నారు.

అయితే చైతన్య-సమంత ఎంగేజ్మెంట్ ఇంకా ఫిక్స్ కాక పోవడంతో త్వరలోనే అందుకు సంబంధించిన డేట్ ప్రకటిస్తామని నాగార్జున తెలిపారు.

అఖిల్ పెళ్లాడబోయేది

అఖిల్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు శ్రీయ భూపాల్. హైదరాబాద్ కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మీడియాకు ఈ విషయం లీక్ కావడంతో అందరికీ విషయం తెలిసిపోయింది.

నాగార్జున ఫ్యామిలీకి ఆమె ముందే తెలుసు

ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి వారికి పరిచయం చేసాడట అఖిల్.

శ్రీయ భూపాల్

ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులోని ‘పార్సన్స్ స్కూల్ ఆప్ డిజైన్' డిజైనింగ్ కోర్సు చేసిందట. ప్రస్తుతం ఇండియాలో డిజైనింగ్ రంగంలో తన టాలెంటును నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.

 

శ్రీయ భూపాల్ ఎవరి కూతురు?

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు అని అంటున్నారు. మొత్తానికి అఖిల్ తమ రేంజికి తగిన అమ్మాయినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడన్నమాట.

నిశ్చితార్థం విషయం నాగార్జున ప్రకటించారు

డిసెంబర్ 9న అఖిల్ ఎంగేజ్మెంట్ జరుగుతుందని నాగార్జున స్వయంగా వెల్లడించారు. వివాహం 2017లో ఉంటుందన్నారు.

 

వీరిద్దరి పెళ్లి ఎప్పుడంటే..

నాగ చైతన్య, సమంత పెళ్లి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఇద్దరూ ఎప్పుడంటే అప్పుడు తాను పెళ్లి చేయడానికి సిద్ధమని నాగార్జున స్పష్టం చేసారు.

అందరికీ పరిచయం చేసిన నాగ్

ఇటీవల జరిగిన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు పెళ్లి వేడుకలో సమంత, నాగ చైతన్య జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ తనకు కాబోయే పెద్ద కోడలు సమంత అంటూ అందరికీ పరిచయం చేసాడు.

అఖిల్ తో కలిసి సమంత

ఇటీవల జరిగిన పెళ్లి వేడుకలో తనకు కాబోయే వదినమ్మ సమంతతో కలిసి అఖిల్ అక్కినేని.

English summary
Nagarjuna announced Akhil's engagement date. He said Akhil will be getting engaged on the 9th of December.
Please Wait while comments are loading...