twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ఎమోషనల్ అయిపోయాడు? నచ్చక పోతే రిలీజ్ చేయను.., నాగార్జున (ఫొటోలు)

    సినిమా బాగుంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టాను. మాకు నచ్చకుండా మాత్రం మేం సినిమా రిలీజ్ చేయం. అంటూ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా గురించి చెప్పాడు నాగార్జున

    |

    నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్ పూర్తయిపోయింది. ఈ విషయాన్ని నాగార్జున చెబుతూనే "కళ్యాణ్ కృష్ణ కేరక్టరైజేషన్ చాలా బాగుంటుంది. తెలుగుదనం. నేటివిటీ అతనికి బాగా తెలుసు. రా రండోయ్ లో కూడా ఇదే అంశం కనిపిస్తుంది. దర్శకుడితో కలిసి రోజూ ఎడిటింగ్ రూమ్ లో కూర్చుంటున్నాను. సినిమా బాగుంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టాను. మాకు నచ్చకుండా మాత్రం మేం సినిమా రిలీజ్ చేయం. మూడో వారంలో విడుదల చేయాలని చూస్తున్నాం' అంటూ అనౌన్స్ చేసాడు..

    రా రండోయ్ వేడుక చూద్దాం

    రా రండోయ్ వేడుక చూద్దాం

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు.. అత్తారింటికి దారేది.. మనం.. గోవిందుడు అందరివాడేలా లాంటి సినిమాలతో టాలీవుడ్ ట్రెండ్.. మెల్లగా ఫ్యామిలీ మూవీల వైపు నడుస్తోంది. మంచి కథ.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లే ఉంటే.. ఈ సినిమాలకు ఇంకా ఆడియన్స్ ఆదరణ ఉందని కూడా ప్రూవ్ అయ్యింది. ఇదే వరుసలో.. ఇప్పుడు.. రా రండోయ్ వేడుక చూద్దాం.. అనే మరో క్రేజీ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్లాన్ చేసింది.

    ట్యాలెంట్ ముఖ్యం అనుకుంటాను

    ట్యాలెంట్ ముఖ్యం అనుకుంటాను

    నాగార్జున మాట్లాడుతూ .... 'మూవీలో కీలకమైన నాలుగు కేరక్టర్లు బాగా వచ్చాయ్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటాడు. ఈ సినిమాకి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. టెక్నీషియన్స్ లో చాలా మంది కొత్త వాళ్లయినా చాలా ప్యాషన్ తో పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ లాంటివన్నీ వద్దు.. యాక్టింగ్.. ట్యాలెంట్ ముఖ్యం అనుకుంటాను.

     కళ్యాణ్ కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని

    కళ్యాణ్ కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని

    మూవీలో ఎమోషన్స్ కనిపిస్తే.. సినిమా బాగుంటుంది. కళ్యాణ్ కృష్ణ గురించి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో తనకే కాదు.. నాకు కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చాడు. బంగార్రాజు పాత్రను చూస్తే.. అతను పాత్రలను ఎలా డిజైన్ చేస్తాడో అర్ధమవుతుంది' అంటూ కళ్యాణ్ కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని చెప్పాడు.

    ఆ రాకుమారుడు ఎవరు?

    ఆ రాకుమారుడు ఎవరు?

    ''ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ 'నిన్నే పెళ్లాడతా'లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని 'మన్మధుడు'లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌తో చెప్పాను. ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు.

    జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా

    జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా

    నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. కథ వినగానే బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌షిప్‌ ఎలా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో నేను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్‌ సేమ్‌ అలాగే ఉంటాయి. అలాగే సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది.

    ఒకరంటే ఒకరికి ప్రాణం

    ఒకరంటే ఒకరికి ప్రాణం

    ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత బాగా వారిద్దరి క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్‌ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌గా హైలైట్‌ అవుతాయి. దేవి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. విశ్వేశ్వరరావు కెమెరా విజువల్స్‌ సూపర్‌గా వచ్చాయి.

    చెప్పినట్లుగానే తీశాడు

    చెప్పినట్లుగానే తీశాడు

    కొత్త కెమెరామెన్‌ అయినా ప్యాషన్‌తో వర్క్‌ చేశాడు. కళ్యాణ్‌ ఆర్టిస్టులందర్నీ బాగా అందంగా చూపించాడు. చెప్పింది చెప్పినట్లుగానే తీశాడు. ఎమోషన్స్‌ బాగా కనబడాలి అప్పుడే సినిమా పండుతుంది. డైరెక్టర్‌గా కంటే కళ్యాణ్‌ మంచి రైటర్‌. అతని రైటింగ్‌ స్కిల్స్‌ చూసి 'సోగ్గాడే చిన్నినాయనా'కి తీసుకున్నాం. నాకు పెద్ద హిట్‌ ఇచ్చాడు. బంగార్రాజు క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశాడు. చాలా మంచి పేరు వచ్చింది.

    నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం

    నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం

    తెలుగుదనం, నేటివిటీ గురించి కళ్యాణ్‌కి బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది. మేమంతా శాటిస్‌ఫాక్షన్‌ అయ్యాకే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్తున్నా. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం. ఒక పాట తప్ప సినిమా అంతా కంప్లీట్‌ అయింది. మే మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. లెజెండ్‌లో యాంగ్రీ సాల్ట్‌ పెప్పర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన జగపతిబాబు ఈ చిత్రంలో మోడరన్‌ స్టైలిష్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.

    తెలుగు నేర్చుకుని

    తెలుగు నేర్చుకుని

    రకుల్‌ బ్రమరాంబ క్యారెక్టర్‌లో నటించింది. డిఫరెంట్‌గా చాలా బాగా చేసింది. తెలుగు నేర్చుకుని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి బ్యూటిఫుల్‌గా చేసింది. సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈ సినిమాతో రకుల్‌కి చాలా మంచి పేరు వస్తుంది. చైతు తన క్యారెక్టర్‌కి జస్టిస్‌ చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సమ్మర్‌లో వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ లవ్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఫిలిం ఇది'' అన్నారు.

    English summary
    Speaking about the film, Nag said “I spent days in the editing room for this film. I decided to meet the press when I am confident about the film. I promise a blockbuster with Rarandoy Veduka Chuddam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X