twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీపుర్లు పట్టి...నాగ్, నాగచైతన్య, అఖిల్ (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబం ఆదివారం 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆవరణను వారు శుభ్రం చేశారు.

    ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 'స్వచ్ఛ భారత్‌'లో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ప్రముఖుల్లో అనిల్‌అంబానీ ఒకరు.

    ప్రధాని మోదీ పిలుపుమేరకు అక్కినేని కుటుంబం 'స్వచ్ఛభారత్‌'లో మమేకమైంది. సినీనటుడు అక్కినేని నాగార్జునతోపాటు అమల, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌, నాగసుశీల తదితరులు చీపుర్లు పట్టుకుని అన్నపూర్ణ స్టూడియో ఆవరణను శుభ్రం చేశారు. ఆ ఫొటోలు స్లైడ్ షో లో...

    ఉదయం నుంచీ...

    ఉదయం నుంచీ...

    ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరిశుభ్రతా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ...

    నాగార్జున మాట్లాడుతూ...

    మనమంతా రోజూ రెండు గంటల సమయాన్ని కేటాయించి.. మన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తే స్వచ్ఛభారత్‌ సాకారమవుతుందన్నారు.

    అంతేకాదు...

    అంతేకాదు...

    ఈ కార్యక్రమస్ఫూర్తితో నాగ్‌4స్వచ్ఛభారత్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని.. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న ఔత్సాహికులు తమ ఫొటోలను పంపితే అందులో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. అభిమానులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నాగార్జున కోరారు.

    నాగార్జున కంటిన్యూ చేస్తూ...

    నాగార్జున కంటిన్యూ చేస్తూ...

    ''ప్రధాని స్వచ్ఛ భారత్‌ కోసం ఇచ్చిన పిలుపును అందుకుని సచిన్‌, అనిల్‌ అంబానీ, సానియా సహా పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో ఒక గంటో, రెండు గంటలని కాకుండా ఈ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని కేటాయించి మన ఇంటినే కాకుండా పరిసరాలను క్లీన్‌ చేస్తే స్వచ్ఛ భారత్‌ను మనం చూడవచ్చు.

    స్పూర్తిగా..

    స్పూర్తిగా..

    భారత ప్రభుత్వం 'స్వచ్ఛ భారత్‌'పేరుతో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనటం ఖచ్చితంగా స్పూర్తిని ఇస్తుందంటున్నారు.

    అభిమానులూ...

    అభిమానులూ...

    అక్కినేని అభిమానులు కూడా ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేయాలని కోరుతున్నాను అని నాగార్జున పిలుపు ఇచ్చారు.

    ప్రధాని ప్రశంస

    ప్రధాని ప్రశంస

    స్వచ్ఛభారత్‌ ఆవిష్కరణ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు నాగార్జున కృషి మరింత దోహదపడుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

    అఖిల్ సైతం...

    అఖిల్ సైతం...

    ఈ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా..అక్కినేని అఖిల్ సైతం ఇలా చీపురు పట్టారు.

    అంతా ప్రతిజ్ఞ

    అంతా ప్రతిజ్ఞ

    తామంతా స్వచ్చ భారత్ కు కట్టుబడి ఉంటామని ఇలా అందరూ ప్రతిజ్ఞ ని నాగార్జున అద్వర్యంలో చేసారు.

    నాగ చైతన్య ఉత్సాహంగా...

    నాగ చైతన్య ఉత్సాహంగా...

    మరో యువ హీరో, అక్కినేని కుటుంబ వారసుడు నాగ చైతన్య కూడా ఇలా చీపురు పట్టుకుని స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అక్కినేని అమల

    అక్కినేని అమల

    ఎప్పుడూ ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో బిజీగా ఉండే అక్కినేని అమల ఈ స్వచ్చ భారత్ కార్యక్రమంలోనూ ఇలా కుటుంబంతో కలిసి పనిచేసారు.

    కలిసికట్టుగా...

    కలిసికట్టుగా...

    అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇలా తమ అన్నపూర్ణ స్టూడియో ఎంప్లాయిస్ తో కలిసి పనిచేయటం ఉద్యోగులలో ఉత్తేజం నింపింది.

    English summary
    Nagarjuna who participated in PM Narendra Modi's Swach Bharat campaign by sweeping the streets today after Reliance MD Anil Ambani nominated him for the program, decided to spread awareness about the program by launching a website.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X