» 

నాగార్జున-డాలీ కాంబినేషన్ ఖరారు చేసిన బెల్లంకొండ

Posted by:
Give your rating:

హైదరాబాద్ : కింగ్ నాగార్జున హీరోగా 'తడాఖా' ఫేమ్ కిషోర్ పార్దాసాని(డాలీ) దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాకు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసారు.

ఈ సినిమా గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'నాగ చైతన్య, సునీల్ కాంబినేషన్‌లో మా బేనర్‌లో డాలీ డైరెక్ట్ చేసిన 'తడాఖా' సూపర్ హిట్టయింది. 'తడాఖా' చిత్రాన్ని చూసి డాలీ టాలెంటుకు ఎంతో ఇంప్రెస్ అయిన నాగార్జున డాలీ డైరెక్షన్లో సినిమా చేయ్యమని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు' అని తెలిపారు.

'నాగార్జనకు అన్ని విధాలా సరిపోయే అద్భుతమైన సబ్జెక్టును డాలీ రెడీ చేసారు. మా బేనర్లో నాగార్జున గారితో ఓ సెన్సేషన్ మూవీ తియ్యాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాము' అని బెల్లంకొండ సురేష్ మీడియాకు తెలియజేసారు.

డాలీ దర్శకత్వంలో నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన 'తడాఖా' చిత్రం ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన 'వెట్టై' చిత్రానికి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.

Read more about: nagarjuna, bellamkonda suresh, tadakha, naga chaitanya, sunil, నాగార్జున, బెల్లంకొండ సురేష్, తడాఖా, నాగచైతన్య, సునీల్
English summary
Bellamkonda Suresh said, “Tadakha has become a big hit and Nagarjuna was quite happy with the output when he saw the film before its release. When I requested him to do a film under Dolly’s direction, Nagarjuna agreed to do the film without any hesitation.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive