» 

'గ్రీకువీరుడు' సీజీ వర్క్‌లో కొన్ని లోపాలు: నాగార్జున

Posted by:

హైదరాబాద్ : సీజీ వర్క్‌లో కొన్ని లోపాలున్న మాట నిజమే...అంటూ ఒప్పుకున్నారు నాగార్జున. తన తాజా చిత్రం 'గ్రీకువీరుడు' సక్సెస్ మీట్ లో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. 'గ్రీకువీరుడు' సినిమా గ్రాఫిక్స్ బాగోలేందంటూ విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఆయన ఇలా స్పందించారు.

ఇక తాను ఊహించినట్లుగానే ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ 'గ్రీకువీరుడు' ఆకట్టుకుందని ఆయన అన్నారు. ఇక ఓవర్సీస్‌లోనూ సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'సంతోషం' వంటి హిట్ తర్వాత దశరథ్ కాంబినేషన్‌లో మరో హిట్ రావడం ఇంకా ఆనందంగా ఉంది. సంభాషణలకు ప్రేక్షకులు బాగా స్పందిస్తున్నారు.

కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కె. విశ్వనాథ్‌గారు భుజం తడితే కన్నీళ్లు వచ్చేవి. నయనతారకీ, నాకూ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చాలా మంది అంటున్నారు. తను చక్కని నటి. తమన్ సంగీతం, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్ అయ్యాయి. నాన్నగారు సినిమా చూసి చాలా బావుందన్నారు. అఖిల్‌కి కూడా ఈ సినిమా బాగా నచ్చింది అని చెప్పారు నాగార్జున.

"దాసరి గారు ఫోన్‌చేసి 'ఏడంతస్తుల మేడ' చిత్రాన్ని నీతో రీమేక్ చేస్తే బాగుంటుంది, 'గ్రీకువీరుడు' చూశాక నువ్వు ఆ కథకు యాప్ట్ అవుతావు అనిపించింది.. అని చెప్పారు. ఆ సినిమా సీడీ కూడా ఇచ్చారు. చూసి నిర్ణయించాలి'' అని చెప్పారన్నారు.

Topics: nagarjuna, greeku veerudu, nayantara, నాగార్జున, గ్రీకు వీరుడు, నయనతార
English summary
Nagarjuna says that he is very much happy with Greeku Veerudu Success.

Telugu Photos

Go to : More Photos