» 

'మనం' లో నాగార్జున లుక్ ఇదే...

Posted by:
 

హైదరాబాద్ : అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'మనం'. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం అనుకున్నదానికంటే సినిమా అద్భుతంగా వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని తెలుస్తోంది. నాగార్జునకు జోడీగా శ్రీయ నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సర సన సమంత నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

'వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో కుటుంబం మొత్తం కలసి నటించడం ఇప్పటివరకు రాజ్‌కపూర్‌ కుటుంబానికే దక్కింది. 'మనం' చిత్రం ద్వారా మాకు ఆ అవకాశం వచ్చింది. ఇందులో అఖిల్‌ కూడా నటిస్తే బాగుణ్ను అని అందరూ అంటున్నారు. అఖిల్‌ని మొదట హీరోగా చూసి.. తర్వాత మల్టీస్టారర్‌, కుటుంబ చిత్రాలు చేయాలన్నదే నా ఆలోచన..అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'మనం' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ చేస్తాడన్న రూమర్స్ ని ఇలా ఖండించారు నాగార్జున.

గతంలో నాగేశ్వరావు, నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

Read more about: nagarjuna, akkineni nageswara rao, naga chaitanya, manam, samantha, shriya, rekha, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, మనం, సమంత, శ్రీయ, రేఖ
English summary
This is the first photo of Akkineni Nagarjuna from the Akkineni multi-starrer project, ‘Manam’. Nagarjuna is looking quite handsome here. The funky beard has been removed for a more traditional look.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos