twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డ్: నాగ్‌తో పాటు 4311 మంది అవయవదానం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యశోదా హాస్పటల్స్, జీవన్‌దాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవదానంపై అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    అవయవదానం వల్ల ఎంతో మందికి పునర్జన్మనిచ్చినవారమవుతామని, ప్రతి ఒక్కరూ అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాగార్జున కోరారు. చాలా మంది ఇష్టం లేక కాదు...సరైన అవగాహన లేక అవయవదానం కార్యక్రమంలో భాగం కాలేక పోతున్నారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఒకే రోజు నాగార్జునతో పాటు రికార్డు స్థాయిలో 4311 మంది అవయవదానానికి ముందుకు రావడం గమనార్హం.

    అవయవదానం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

    నాగార్జున

    నాగార్జున

    అవయవదానంపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న నాగార్జున.

    ఆర్గాన్ డోనర్ కార్డ్

    ఆర్గాన్ డోనర్ కార్డ్

    నిర్వాహకుల నుండి ఆర్గాన్ డోనర్ కార్డును అందుకుంటున్న నాగార్జున.

    సన్మానం

    సన్మానం

    అవయవదానం అవగాహన కార్యక్రమంలో నాగార్జునను నిర్వాహకులు సన్మానించారు.

    ఆశీర్వాదం

    ఆశీర్వాదం

    శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆశీర్వాదం తీసుకుంటున్ననాగార్జున.

    అవగాహన

    అవగాహన

    అవయవదానం అంశంపై అవగాహన కల్పిస్తున్న నాగార్జున.

    English summary
    Nagarjuna's organ donation drive for Yasodha hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X