twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నిర్మలా కాన్వెంట్‌'లో నాగార్జున గెస్ట్ రోల్ లో...

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌'లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సన్ షైన్ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో పి. రామ్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్, కుమార్తో మేధ. పెద్ద కొడుకు రోషన్ వయసు 20 సంవత్సరాల లోపే... ఇతన్ని క్యూట్ లవ్ స్టోరీ ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పి. రామ్ మోహన్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Nagarjuna special in Srikanth son debut

    ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ మధ్య కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలను చిన్న తనంలోనే తమ వారసులను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఆంధ్ర పోరి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే దారిలో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ను వెండి తెరకు పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    అలాగే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సైజ్‌ జీరో'లోనూ నాగార్జున కనిపించబోతున్నారు. ఆ విషయాన్ని నాగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రీకరణలో ఉన్నారు.

    English summary
    Nagarjuna also doing a special role in Anushka's ‘Size Zero’. According to the latest, he is doing another special role. It is known that hero Srikanth's son Roshan is making his debut with the film ‘Nirmala Convent’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X