twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరోజుల్లోనే ఆమె శృంగార దేవత(బర్త్ డే స్పెషల్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ అండ్ సెక్సీ భామ నగ్మా అప్పట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో నెం.1 హీరోయిన్‌గా చక్రం తప్పింది. అప్పట్లో సౌతిండియా టాప్ హీరోలందరితోనూ జత కట్టింది. బాలీవుడ్లో పరిశ్రమకూ తన గ్లామర్ రుచి చూపెట్టింది. ఈ రోజు నగ్నం 40వ పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    తెలుగులో నగ్మ నటించిన ప్రేమికుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాషా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. వయసు పైబడటంతో హరోయిన్ పాత్రల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి సిద్ధమైన నగ్మ చివరి సారిగా తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో కనిపించింది.

    నగ్మ తెలుగు తెరపై కనిపించక పుష్కరకాలం దాటి పోయింది. 2007 తర్వాత ఆమె ఏ బాషలోనూ సినిమాలు చేయలేదు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    తేజ దర్శకత్వంలో రీ ఎంట్రీ అన్నారు కానీ..

    తేజ దర్శకత్వంలో రీ ఎంట్రీ అన్నారు కానీ..

    నగ్మ మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తెలుగు దర్శకుడు తేజ త్వరలో చేయబోయే సినిమాలో ఆమె నటించబోతోందని అన్నారు. అయితే ఆ వార్తలు వార్తలుగానే ఉన్నాయి తప్ప నిజం కాలేదు.

    తెలుగులో నగ్మ నటించిన సినిమాలు...

    తెలుగులో నగ్మ నటించిన సినిమాలు...

    తెలుగులో నగ్మ పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, అశ్వమేధం, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సూర్య పుత్రులు, మౌనం, అల్లరి రాముడు, కొండపల్లి రాజా, ముగ్గురు మొనగాళ్లు, రాజసింహం, రెండిళ్ల పూజారి, సరదా బుల్లోడు, సూపర్ పోలీస్, వారసుడు, గ్యాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించింది.

    నగ్మకు పేరు తెచ్చిన చిత్రాలు

    నగ్మకు పేరు తెచ్చిన చిత్రాలు

    నగ్మ తెలుగులో నటించిన తొలి చిత్రం కిల్లర్. 1990లో హిందీలో బాఘి చిత్రంలో ఎంట్రీ ఇచ్చినా ఆమె తొలి హిట్ రుచి చూసింది మాత్రం 1991లో వచ్చిన తెలుగు సినిమా ‘కిల్లర్'తోనే. ఆ తర్వాత ఆమెకు ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి.

    నటించిన సినిమాలు 70 పైనే...

    నటించిన సినిమాలు 70 పైనే...

    నగ్నమ తెలుగు, తమిళం, హిందీ భాషల్లా బాగా పాపులర్ అయింది. వీటితో పాటు మరాఠి, భోజ్‌పురి, కన్నడ, మళయాలం భాషల్లోనూ నటించింది. అన్నీ భాషల్లో కలిసి నగ్మ ఇప్పటి వరకు దాదాపు 70 చిత్రాల్లో నటించింది.

    నగ్మ అసలు పేరు...

    నగ్మ అసలు పేరు...

    నగ్మ అసలు పేరు నందితా మోరార్జీ. అయితే ఆమె స్క్రీన్ నేమ్ మాత్రం నగ్మ. ఆ పేరుతోనే ఆమె పాపులర్ అయింది. ఆమె పేరులోని సెక్సీ తనం కూడా చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది.

    పుట్టింది ముంబైలో..

    పుట్టింది ముంబైలో..

    నగ్మ డిసెంబర్ 25, 1974లో ముంబైలో జన్మించింది. ముస్లిం మధర్, హిందూ ఫాదర్‌కు జన్మించింది. ఆమె అసలు తండ్రి అరవింద్ ప్రతాప్ సింగ్ మోరార్జీ. నగ్మ పూర్వీకులు జైసల్మీర్ కు చెందిన రాజకుటుంబీకులు. తర్వాత వారు గుజరాత్, పోరుబందర్, ముంబైలలో స్థిరపడ్డారు.

    సినీ రంగంలోకి ఎలా అంటే..?

    సినీ రంగంలోకి ఎలా అంటే..?

    నమ్మ సినీ రంగంలోకి రావడానికి ఆమె సవతి తండ్రే కారణం. నగ్మ తల్లి సీమ 1973లో మోరార్జీ నుంచి విడిపోయింది. ఆ తర్వాత 1974లో నగ్మ జన్మించింది. ఆతర్వాత 1975లో నగ్మ తల్లి సీమ సినీ నిర్మాత అయిన చందర్‌ను పెళ్లాడింది. ఇలా సినిమా వాతావరణంలో పెరగడంతో నగ్మ అడుగులు సినీమారంగం వైపు పడ్డాయి.

    రాజకీయాల్లోకి...

    రాజకీయాల్లోకి...

    సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నగ్మ ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టింది.

    English summary
    Nagma Birthday today, Nandita Morarji or Narmatha Sadanah better known as Nagma is an Indian actress of Bollywood, Tollywood and Kollywood. At her peak in the 1990s, she "dominated Tamil cinema," to quote The Hindu. Born of a Muslim mother and a Hindu father on Christmas Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X