»   » బాలయ్య ఫ్యాన్సా మజాకా! టాలీవుడ్లో ఫస్ట్ టైం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

బాలయ్య ఫ్యాన్సా మజాకా! టాలీవుడ్లో ఫస్ట్ టైం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం 900 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో అక్టోబర్ 5 జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ 99 సినిమాలు చూసేందుకు రూ. 100 పెట్టి టికెట్ కొంటే చాలు.

టాలీవుడ్లో ఇదే తొలిసారి

మ‌రే హీరో సినిమాల‌కు లేని విధంగా బాల‌కృష్ణ అభిమానులు `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థమం.

లిమ్కా బుక్ రికార్డ్

ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

గౌతమీ పుత్రశాతకర్ణి

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చ‌క్రవ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతున్న చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

టీజర్

అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

షూటింగ్

గౌత‌మిపుత్ర శాత‌కర్ణి సినిమా సినిమాలో నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల మ‌ధ్య ప్రదేశ్‌లో జ‌రిగిన నాలుగో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో రాజసూయ యాగాన్ని నిర్వహ‌ణ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఐదో షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా టాకీకి సంబంధించి మేజర్ పార్ట్ అంతా పూర్తయ్యిందని తెలిపారు.

సంక్రాంతి

సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు

బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రియ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

English summary
Watching a solitary film in Theater for once costs in any event around Rs 100. In such circumstances, About 99 movies have been offered for quite recently Rs 100 and this mind boggling offer got everybody's consideration. Administration of Archana Theater in Proddatur wanted to screen all the 99 motion pictures of Nandamuri Balakrishna. A film of Nata Simha will screen every day. Its like a bumber offer for Nandamuri Fans for Dussehra, Divali, Moharam and Christmas. Theater Owner Obulreddy affirmed the reports.
Please Wait while comments are loading...