twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదం లో బాలకృష్ణ:నందమూరి వీరాభిమాని మృతి

    బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాశిం(53) బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నందమూరి కుటుంబానికి ఎప్పటినుంచో అభిమానిగా ఉంతూ బాలకృష్ణ ప్రతీ పుట్టిన రోజుకీ, ప్రతీ సినిమా రిలీజ్ కీ సేవా

    |

    బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాశిం(53) బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. నందమూరి కుటుంబానికి ఎప్పటినుంచో అభిమానిగా ఉంతూ బాలకృష్ణ ప్రతీ పుట్టిన రోజుకీ, ప్రతీ సినిమా రిలీజ్ కీ సేవా కార్యక్రమాలని చేపట్టే నంద్యాలలోని నూనెపల్లె వీధికి చెందిన ఖాశిం ఎన్‌టీ రామారావు హయాం నుంచి నందమూరి కుటుంబానికి సన్నిహితుడు.

    బాలకృష్ణకు వీరాభిమాని కావడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఖాశిం 75 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. సీఎం చంద్రబాబు నాయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌బాబు చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు, బహుమతులు ఖాశిం అందుకున్నాడు.

    Nandamuri fans association president died

    బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు స్థానిక సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ వార్తని వినగానే బాలయ్య తీవ్రంగా మనస్తాపం చెందారని సమాచారం. అయితే ఇంకా బాలకృష్ణ స్పందన అదికారికంగా బయటకు రాలేదు.

    మాజీ మంత్రి ఫరూక్‌, భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపంటీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఖాశిం మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు. టీడీపీ యువ నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి, పట్టణంలోని వివిధ సినిమా థియేటర్ల యజమానులు, సినీ నటుడు బాలకృష్ణ పీఏ తుమ్మినేని శ్రీనివాసరావు, పట్టణంలోని టీడీపీ నాయకులు హాజరై నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం స్థానిక సాయిబాబానగర్‌లోని శ్మశాన వాటికలో ఖాశిం అంత్యక్రియలు నిర్వహించారు.

    English summary
    Nandamuri fans association president khashim from Nandyala is died with heart strock
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X