twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటో :లోకేష్ కొడుకు దేవాన్ష్‌తో కల్యాణ్‌రామ్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌: అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో తన బోసి నవ్వులతో ప్రధాని మోదీని ఆకట్టుకున్న నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ను తిరుగు ప్రయాణంలో మామ కల్యాణ్‌రామ్‌ ముద్దుచేశారు.

    With little Nara Devansh and my son Souryaram, on the way back from Amaravati ground breaking ceremony :)

    Posted by Nandamuri Kalyanram on 26 October 2015

    తిరుగు ప్రయాణ సమయంలో దేవాన్ష్‌ తన ఒళ్లో చక్కగా నిద్రపోతున్న ఓ ఫొటోని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు కల్యాణ్‌రామ్‌. ఈ ఫొటోలో కల్యాణ్‌రామ్‌ తనయుడు శౌర్యరామ్‌ను కూడా చూడవచ్చు.

    కళ్యాణ్ రామ్ 'షేర్‌' విశేషాలకు వస్తే....

    నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'.

     హైదరాబాద్‌: అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో తన బోసి నవ్వులతో ప్రధాని మోదీని ఆకట్టుకున్న నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ను తిరుగు ప్రయాణంలో మామ కల్యాణ్‌రామ్‌ ముద్దుచేశారు. తిరుగు ప్రయాణ సమయంలో దేవాన్ష్‌ తన ఒళ్లో చక్కగా నిద్రపోతున్న ఓ ఫొటోని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు కల్యాణ్‌రామ్‌. ఈ ఫొటోలో కల్యాణ్‌రామ్‌ తనయుడు శౌర్యరామ్‌ను కూడా చూడవచ్చు. కళ్యాణ్ రామ్ 'షేర్‌' విశేషాలకు వస్తే.... నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. చిత్రం కాన్సెప్టు గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ... సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌. దర్శకుడు మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌' తర్వాత నటించిన చిత్రమిది. నందమూరి అభిమానులు పండగ చేసుకొనేలా తెరపై విజృంభించి నటించారు. హిందీలో షేర్‌ అంటే సింహం అని అర్థం. సినిమాలో కల్యాణ్‌రామ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుంది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది'' అన్నారు. ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. దర్శకుడు మల్లి కంటిన్యూ చేస్తూ...... 'కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'షేర్‌' ఒక సంచలనాత్మకమైన చిత్రమవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ విజృంభించి నటించారు' అని దర్శకుడు మల్లికార్జున్‌ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...''కల్యాణ్‌రామ్‌ను ఓ సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. డైమండ్‌ రత్నం కథ, మాటలు బాగున్నాయి. తమన్‌ వినసొంపైన బాణీల్ని అందించారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత. నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

    చిత్రం కాన్సెప్టు గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ... సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌.

    దర్శకుడు మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌' తర్వాత నటించిన చిత్రమిది. నందమూరి అభిమానులు పండగ చేసుకొనేలా తెరపై విజృంభించి నటించారు. హిందీలో షేర్‌ అంటే సింహం అని అర్థం. సినిమాలో కల్యాణ్‌రామ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుంది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది'' అన్నారు.

    ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    దర్శకుడు మల్లి కంటిన్యూ చేస్తూ...... 'కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో 'షేర్‌' ఒక సంచలనాత్మకమైన చిత్రమవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ విజృంభించి నటించారు' అని దర్శకుడు మల్లికార్జున్‌ తెలిపారు.

    నిర్మాత మాట్లాడుతూ...''కల్యాణ్‌రామ్‌ను ఓ సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. డైమండ్‌ రత్నం కథ, మాటలు బాగున్నాయి. తమన్‌ వినసొంపైన బాణీల్ని అందించారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు నిర్మాత.

    నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌,

    ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

    English summary
    Nandamuri Kalyanram shares in fb: "With little Nara Devansh and my son Souryaram, on the way back from Amaravati ground breaking ceremony."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X