» 

'దోపిడి'కి హీరో నాని ప్రచారం

Posted by:
Give your rating:

హైదరాబాద్ : హీరో నాని రీసెంట్ గా 'డి ఫర్‌ దోపిడి' సినిమా కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాగ ఆ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా అందించారు. ఇప్పుడు ప్రచార గీతంలో డాన్స్ చేస్తున్నారు. వరుణ్‌ సందేశ్‌, సందీప్‌ కిషన్‌ నటించిన చిత్రం 'డి ఫర్‌ దోపిడి'. సిరాజ్‌ కల్లా దర్శకుడు. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డికె, నాని నిర్మాతలు. ఈ సినిమా కోసం నానిపై ఇటీవల హైదరాబాద్‌లో ప్రచార గీతాన్ని తెరకెక్కించారు. ఆదిల్‌ నృత్య దర్శకత్వం వహించారు.

నాని మాట్లాడుతూ ''వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నప్పుడు సినిమా మొత్తం చూశాను. ఇలాంటి సినిమాలో భాగస్వామిని కావాలనుకొన్నా. అందుకే నిర్మాతగా చేరా. ఈ పాటని సినిమా ప్రచారంలో ఉపయోగిస్తాం. తప్పకుండా మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది''అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ -''నాని మా చిత్రానికి భాగస్వామిగా మారడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇప్పుడు సాంగ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆదిల్ ఈ పాటకు నృత్యరీతుల్ని సమకూర్చారు. ఈ చిత్రం ప్రచారానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని మా నమ్మకం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.


ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాం. మా దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికంటే ముందు ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న మాకు సిరాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. హిందీలో మేం రూపొందించిన షోర్‌ ఇన్‌ ద సిటీ అనే చిత్రానికి అతను అసోసియేట్‌ డెరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన మేం తెలుగు నేటివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న చిత్రమిది. క్రైమ్‌, కామెడీ, సెటైర్‌ అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే సినిమాలు తీయాలన్నది మా ధ్యేయం. వచ్చే ఏడాది రెండు తెలుగు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు.డీ ఫర్‌ దోపిడి చిత్రీకరణ చివరి దశలో ఉందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రాజ్‌, కృష్ణ చెప్పారు.

క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.

Read more about: varun sandesh, sandeep kishan, d for dopidi, nani, వరుణ్ సందేష్, డి ఫర్ దోపిడి, సందీప్ కిషన్, నాని
English summary
Nani is now leaving no stone unturned to give maximum publicity to ‘D for Dopidi’ film. As part of that he will be shooting for a special promotional song at Aluminium factory. The makers are planning to release by Oct end, but no official confirmation has been received yet.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive