twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెల్ఫ్ రియలైజేషన్ ('ఎవడే సుబ్రమణ్యం' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాని హీరోగా చేస్తున్నాడంటే సినిమాలో ఏదో విషయం ఉందనే లెక్క. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం చేసే నానిలో అందరూ పక్కింటి కుర్రాడిని చూసుకొంటుంటారు. ఆయన హీరోగా నటించిన తాజాగా 'ఎవడే సుబ్రమణ్యం' ఈ రోజు (శనివారం) ప్రేక్షకుల ముందుకొస్తోంది. హిమాలయాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం సైతం విభిన్నంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రోమోలు, పోస్టర్ లు ప్రేక్షకులును ఆకర్షించి సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ యూనిట్ అంతా ట్రెక్కింగ్‌ చేసుకొంటూ హిమాలయాలకి వెళ్లి 40 రోజులపాటు అక్కడ చిత్రీకరణ చేయడం ప్రపంచంలోనే మొదటిసారి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    https://www.facebook.com/TeluguFilmibeat

    సుబ్రహ్మణ్యం ఎవరంటే..? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నెలకు లక్షల్లో జీతం. అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులూ ఉన్నాయి. ఓ మనిషికి గుర్తింపు ఈ అంకెలేనా? కానీ సుబ్రహ్మణ్యం దృష్టిలో ఈ అంకెలే ప్రపంచం. అతని జీవితాన్ని మలుపు తిప్పడానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు? ఆ తరవాత ఏమైంది? తెలుసుకోవాలంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా చూడాలి. భిన్న వ్యక్తిత్వాలున్న ముగ్గురు వ్యక్తులు హిమాలయ కొండల్లో చేసే ప్రయాణమే ఈ సినిమా కథగా చెప్పబడుతుంది.

    కథలో ఇంతకీ ఎవరీ సుబ్రమణ్యం అంటే...నానినే..సినిమాలో సుబ్రమణ్యం. చుట్టూ ఉన్న జనం చూడాలని మనకు మనం రకరకాల హంగులతో కనిపించే ప్రయత్నం చేస్తుంటాం. అలాంటి ఆలోచనలున్న మనలోని ఓ కుర్రాడే సుబ్రమణ్యం. లెక్కలు తప్ప అతనికి మరో ధ్యాస ఉండదు. అలాంటి కుర్రాడు ఎలా మారాడు? తానేంటి అన్నది ఎప్పుడు తెలుసుకొన్నాడు? అనేదే ఈ చిత్రం.

    నాని మాట్లాడుతూ...చాలాసార్లు అనిపించేది. ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువయ్యేవి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగొచ్చేటప్పుడు కలిగిన సంతోషం మాత్రం మాటల్లో వర్ణించలేను. ఈ సినిమాకోసం హిమాలయాలు ఎక్కేటప్పుడు దారిలో ఎక్కడ పడితే అక్కడ పడుకొనేవాళ్లం. ఆ ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఈ సినిమా చూశాక అందరూ మనమేంటన్నది ఓసారి ఎవరికి వాళ్లు మననం చేసుకొంటారు. నాగ్‌ అశ్విన్‌ కథ చెప్పిన విధానం, ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. తనని నమ్మి ఈ చిత్రాన్ని చేసినందుకు గర్వంగా ఉంది. స్వప్నదత్‌, ప్రియాంక దత్‌ ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం అద్భుతం అనే చెబుతా అని అన్నారు.

    Nani's Yevade Subramanyam preview

    నిర్మాత ప్రియాంక దత్‌ మాట్లాడుతూ ‘‘మన దేశంలో ఇంతకు ముందు ఎవరూ తెరకెక్కించని విధంగా హిమాలయాల్లో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. పాటలకు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది''అని తెలిపారు. సప్నదత్‌ మాట్లాడుతూ ‘‘ఆడియోకి చాలా మంచి స్పందన వస్తోంది. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. మేం అనుకున్నదానికన్నా 100 రెట్లు బాగా వచ్చింది'' అని అన్నారు.

    ‘‘కలకాలం గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సినిమా లావి్‌షగా ఉంటుంది. పెద్ద స్ర్కీన్‌మీద చూడాల్సిందే'' అని దర్శకుడు తెలిపారు. ఇందులో రిషి అనే పాత్ర పోషించినట్టు విజయ్‌ దేవరకొండ చెప్పారు.

    బ్యానర్: స్వప్న సినిమా
    నటీనటులు నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, రితు వర్మ, షావుకారు జానకి తదితరులు
    సంగీతం: రధన్‌,
    ఛాయాగ్రహణం: అమిత్‌, భరత్‌.
    నిర్మాత: ప్రియాంకదత్
    రచన,దర్శకత్వం: నాగ్ అశ్విన్
    విడుదల తేదీ: 21,మార్చి 2015

    English summary
    Actor Nani’s Yevade Subramanyam is all set for a grand release on March 21st. It features Malavika Nair as the female lead and this movie revolves around the story of a young corporate executive named Subramanyam who finds his true self on a journey. Movie is touted to be thriller film which is directed by debutant Nag Ashwin and produced by Priyanka Dutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X