»   » ‘నాన్నకు ప్రేమతో’ ప్రీ రిలీజ్ బిజినెస్ 54 కోట్లు, ఏరియా వైజ్ డీటేల్స్

‘నాన్నకు ప్రేమతో’ ప్రీ రిలీజ్ బిజినెస్ 54 కోట్లు, ఏరియా వైజ్ డీటేల్స్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రేపు(జనవరి 13) వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.


ఈ సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్ ప్రీ డిజినెస్ డిటేల్స్ బయటకు వచ్చాయి. మొత్తం రూ. 54 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


నైజాం

నైజాం ఏరియాలో అభిషేక్ పిక్చర్స్ వారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ పద్దతిలో రూ. 14 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


సీడెడ్

సైడెడ్ ఏరియాలో ఈ చిత్రాన్ని రిలయన్స్ రఘు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ పద్దతిలో రూ. 7.7 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


వైజాగ్

వైజాగ్ ఏరియాలో విబిఎం రెడ్డి నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ పద్దతిలో రూ. 4.5 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


ఈస్ట్

ఇష్నా ఎంటర్టెన్మెంట్స్ వారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ పద్దతిలో రూ. 3.05 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


వెస్ట్

ఉషా పిక్చర్స్ వారు 2.80 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


నెల్లూరు

ఆరెంజ్ మీడియా వారు 1.7 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


గుంటూరు

ఎస్.వి సినిమాస్ వారు రూ. 4.5 కోట్లకు దక్కించుకున్నారు.


కృష్ణ

అలంకార్ ప్రసాద్ రూ. 3 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


చెన్నై

ఎస్.పి.ఎల్ సినిమాస్ వారు 40 లక్షలకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


కర్నాటక

బృందావన్ అసోసియేట్స్ ద్వారా అమృత అసోసియేట్స్ రూ. 5 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


రెస్టాఫ్ ఇండియా

ఫాంటమ్ పిక్చర్స్ వారు రూ. 50 లక్షలకు ఈచిత్రాన్ని దక్కించుకున్నారు.


ఓవర్సీస్

సినీప్లస్ గెలాక్సీ వారు రూ. 6.2 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నారు.


English summary
Check out the Detailed Pre Release Box Office Business Report of Jr NTR’s Nannaku Prematho.
Please Wait while comments are loading...