» 

నారా రోహిత్ చిత్రం ఆ తమిళ రీమేక్

Posted by:

హైదరాబాద్ : భీమిలీ కబడ్డి జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నారా రోహిత్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'శంకర' అనే పేరుని ఖరారు చేశారు. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన మౌన గురు చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం స్లీపర్ హిట్ గా నమోదు అయ్యింది.

మౌనగురు చిత్రం సైలెంట్ గా ఉండే ఓ కాలేజీ కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. ఊహించని విధంగా ఓ మిస్ అండర్ స్టాండ్ తో అతనో క్రైమ్ లో ఇరుక్కుంటాడు. అక్కడ నుంచి అతని జీవితం మారి పోతుంది. ఆ క్రైమ్ నుంచి ఎలా బయిటపడ్డాడన్న ఏంగిల్ లో ఈకథ జరుగుతుంది.

'శంకర' చిత్రానికి ఆర్‌.వి.చంద్రమౌళి ప్రసాద్‌ (కిన్ను) నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు. శ్రీలీలా మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెజీనా హీరోయిన్.

దర్శకుడు తాతినేని సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''నారా రోహిత్‌ నటన అందరికీ నచ్చుతుంది. ఈ నెల 22 నుంచి పాటల్ని చిత్రీకరిస్తాం. వచ్చే నెల మొదటి వారంలో గీతాల్ని, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తా ము''అన్నారు. ఆహుతిప్రసాద్‌, జాన్‌ విజయ్‌, రాజీవ్‌ కనకాల, చిన్నా, రాఖీ, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కళ: సాహి సురేష్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.

Read more about: nara rohit, madrasi, solo, regina, నారా రోహిత్, మద్రాసి, సోలో, ఒక్కడినే, తాతినేని సత్య
English summary
Sources say Nara Rohit's latest film Shankara is a Tamil Remake named Mouna guru. Mouna guru illustrates a misunderstood college youth becomes unwittingly involved in a crime plot that spirals his life out of order.
Please Wait while comments are loading...