»   » బావ బావమరిది ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మోక్షజ్ఞ బర్త్ డే (ఫోటోస్)

బావ బావమరిది ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మోక్షజ్ఞ బర్త్ డే (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బావ బావమరిది ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నందమూరి నాలుగోతరం నటుడిగా త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నారా రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నారా రోహిత్ విడుదల చేసారు. స్లైడ్ షోలో ఫోటోస్ చూడొచ్చు.

నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ గురించి ఫ్యాన్స్ సర్కిల్ లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా అతని గురించి ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది.

నందమూరి హీరోలందరూ మాస్ ఇమేజ్ తోనే పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను కూడా మాస్ హీరోగానే తెరంగ్రేటం చేయించబోతున్నారట. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేది ఇప్పుడే కాదని, 2017లో అతని ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ గ్యాపులో మోక్షజ్ఞను సినిమాలకు తగిన విధంగా లుక్, బాడీ లాంగ్వేజ్ ఉండేలా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

నారా రోహిత్
  

నారా రోహిత్

మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న నారా రోహిత్.

అంచనాలు
  

అంచనాలు

మోక్షజ్ఞ ఎంట్రీపై అంచనాలు భారీగా ఉన్నాయని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

త్వరలోనే...
  

త్వరలోనే...

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, త్వరలోనే తెరంగ్రేటం ఉంటుందని తెలిపారు.

బావబావమరిది ఫ్యాన్స్
  

బావబావమరిది ఫ్యాన్స్

బావబావమరిది ఫ్యాన్స్ పేరుతో అభిమానులు ఇలా...

 

 

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos