twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం దమ్ము సామీ...! ఈ వార్తలు నిజమైతే... అప్పట్లో ఒకడుండేవాడు ఒక కుదుపు కుదిపినట్టే...

    రేపు రిలీజ్ అవబోతున్న సినిమా చుట్టూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఏ ఒక్కటీ నార్మల్ న్యూస్ మాత్రం కాదు

    |

    వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్‌. తాజాగా ఆయన నటించిన చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. శ్రీవిష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని, ఈనెల 30న విడుదలవుతోంది. అయితే వీటిలో ఎన్ని నిజాలో ఏమో తెలీదు గానీ

    ఇండస్ట్రీ లో మాత్రం ఈ సినిమా ఇప్పుడొక హాట్ టాపిక్ అయ్యింది. ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్ సినిమా ఇది. 92-96 నేప‌థ్యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించాం. నారా రోహిత్‌గారి స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. కాంప్లికేటెడ్ స‌బ్జెక్ట్‌. ధుర్యోధ‌నుడు, క‌ర్ణుడు అనే రెండు క్యారెక్ట‌ర్స్ ఉండే సినిమా. ధుర్యోధ‌నుడిలా ఈగో ఉన్న క్యారెక్ట‌ర్‌లో నారా రోహిత్ క‌న‌ప‌డితే, అన్ని మంచి ల‌క్ష‌ణాలున్నా ఎక్క‌డో తేడా ఉండే క‌ర్ణుడు వంటి క్యారెక్ట‌ర్‌లో శ్రీవిష్ణు న‌టించారు. భార‌తంలో ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితులైతే, ఇక్క‌డ ఈ ఇద్ద‌రు విరోధులుగా క‌న‌ప‌డ‌తారు అని డైరెక్టర్ సాగర్ చంద్ర చెప్పినప్పుడు మామూలుగా తీసుకున్నారు గానీ... రేపు రిలీజ్ అవబోతున్న సినిమా చుట్టూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఏ ఒక్కటీ నార్మల్ న్యూస్ మాత్రం కాదు నిజంగా ఆ సబ్జెక్ట్లని టచ్ చేసి ఉంటే మాత్రం మేకర్స్ దమ్ముని మెచ్చుకోవాల్సిందే... ఇంతకీ వినిపించే ఆ వార్తలేమిటంటే....

     స్టాంపుల కుంభకోణం ?

    స్టాంపుల కుంభకోణం ?


    సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం స్టాంపుల కుంభకోణం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. అధికార యంత్రాంగాన్ని తలకిందులు చేసింది. తెహల్కా పత్రిక అప్పట్లో రేపిన స్టాంపుల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంతెంత అన్నది ఈ నెల 30న వెలుగులోకి రానుంది.

     యథాతథంగా:

    యథాతథంగా:


    అది ఎలాగ అంటే ఆరన్ మీడియా వర్క్స్ సమర్పణలో నిర్మిస్తున్న "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రం లో దర్శకుడు సాగర్ చంద్ర స్టాంపుల కుంభకోణం ఎపిసోడ్ ని యథాతథంగా చిత్రీకరించారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమా హీరో నారా రోహిత్ ఇంతియాజ్ అనే పోలీసు ఆఫీసర్ పాత్రలో మరో హీరో శ్రీ విష్ణు రైల్వే రాజు పాత్రలో కనిపిస్తున్నారు.

     వర్ధమాన క్రికెటర్:

    వర్ధమాన క్రికెటర్:


    రైల్వే రాజు ఒక వర్ధమాన క్రికెటర్. విరిందరి జీవితాలు స్టాంపుల కుంభకోణంతో ఏ మలుపులు తీసుకున్నాయి అన్నదే ఈ సినిమా. నిజానికి రైల్వే రాజు, ఇంతియాజ్ పాత్రలు కూడా యథార్థ పాత్రల స్పూర్తేనట. అలా అయినట్లేయితే అప్పట్లో ఒక్కడుండేవాడు చిత్రం పెద్ద చర్చనే లేవదిస్తుంది.

     బెల్లి లలితక్క పాత్ర?

    బెల్లి లలితక్క పాత్ర?


    గ్యాంగ్ స్టర్ నయీమ్ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ప్రజా గాయని బెల్లి లలితక్క పేరే. ప్రజా సంఘాల్లో ఆమె పేరు మారుమోగేది. అయితే నయీమ్ పేరు మొదట వెలుగులోకి వచ్చింది బెల్లి లలితక్క హత్య తోనే. ఆమెను అతిఘోరంగా చంపి, ముక్కలు చేసి వివిధ స్థలాల్లో వేశాడంటారు.

     నయీమ్ పాత్ర:

    నయీమ్ పాత్ర:


    అయితే ఆనాటి ధారుణ ఘట్టాలను మనం చూడబోతున్నామా ? అంటే ఫిల్మ్ నగర్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఈ చిత్రం లో నయీమ్ పాత్రతో పాటు బెల్లి లలిత పాత్ర కూడా ఉందని సమాచారం. అయితే ఈ పాత్రలను దర్శకుడు సాగర్ చంద్ర ఎలా తీర్చిదిద్దాడో తెలుసుకోవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే.

     భోగనాథపురం దొంగలు:

    భోగనాథపురం దొంగలు:


    కొన్నాళ్ళ క్రితం భోగనాథపురం వింటే అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకులు అందరూ గజగజలాడేవారు. ఎందుకంటే భోగనాథపురం దొంగలు మిగితా ముఠాల్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు దొంగతనానికి రారు. దోపిడిలో రక్తం చుక్క చిందనివ్వరు. అత్యాచారాలు చేయరు, అంతెందుకు ఉన్న చోటు వదిలి రిస్క్ తీసుకోరు. వాళ్ళ స్టయిలే వేరు.

     వాళ్ళని ఎవరు అంతం చేశారు:

    వాళ్ళని ఎవరు అంతం చేశారు:


    అలాంటి భోగాపురం దొంగలు ఇప్పుడేమయ్యారు ? వాళ్ళని ఎవరు అంతం చేశారు ? అనేది "అప్పట్లో ఒకడుండేవాడు" లో చూపించారని సమాచారం. నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా చేసిన ఈ సినిమాలో వాస్తవ సంఘటనలు చొప్పించామని దర్శకుడు సాగర్ చంద్ర ప్రెస్ మీట్ లో చెప్పారు. నాటి భోగనాథపురం దొంగల వెనుక ఉన్న రాజకీయ హస్తాల సంగతీ ఇందులో ఉందట.

     ఆ క్రికెటరేనా

    ఆ క్రికెటరేనా


    సినిమాలో హీరో శ్రీవిష్ణు, రైల్వే రాజు పాత్ర పోషిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అయితే ఇందులో శ్రీవిష్ణు చేస్తున్న రైల్వే రాజు పాత్రలో ప్రముఖ క్రికెటర్ జీవితం ఉందని సమాచారం. భారత జట్టులో స్థానం పొందాల్సిన క్రికెటర్ రాజు జీవితం ఊహించని మలుపులు తిరిగి వేరే గమ్యానికి చేరుకుంటుంది.

     హైదరాబాద్ లో ఒకానొక క్రికెటర్:

    హైదరాబాద్ లో ఒకానొక క్రికెటర్:


    ఇదిలా ఉండగా రైల్వే రాజు క్రికెట్ క్రీడా జీవితం ఎవరి వలన, ఎవరెవరి కుట్రవలన ప్రభావితం అయ్యిందన్నది చర్చ. హైదరాబాద్ లో ఒకానొక క్రికెటర్ తన కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాల్సింది దారి తప్పాడు. ఈ రైల్వే రాజు పాత్ర కూడా దానిని స్ఫూర్తిగా చేసుకుని చేశారా ? లేదంటే అదే పాత్రని యథాతథంగా చూపించారా అన్నది తెలియాలి. క్రికెట్ రాజకీయాలు, అసలు రాజకీయాల లోగుట్టును "అప్పట్లో ఒకడుండేవాడు" బయట పెడ్తుంది అంటున్నారు.

     ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి :

    ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి :


    అయితే పోలిటికల్ క్రైమ్ డ్రామా లో ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా చేసిన ఒక పాత్రను యథాతథంగా చూపించారట. అంతేకాదు 1990 లో ఆ పాత్ర రాజకీయాలను, నేరాలను ప్రభావితం చేసిన తీరు కూడా ఉందట. దాంతో ఈ నెల 30న వస్తున్న "అప్పట్లో ఒకడుండేవాడు" ఆ మాజీ ముఖ్యమంత్రి లీలలు వెల్లడిస్తుందని బోగట్టా.

     వాస్తవ సంఘటనలు:

    వాస్తవ సంఘటనలు:


    ఈ చిత్రంలో వాస్తవపాత్రలు, వాస్తవ సంఘటనలు చిత్రీకరించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో జరిగిన భారీ వినాయక ఉత్సవాల్లో కొంతమంది రాజకీయ నాయకులు చేపకింద నీరులా చేసిన కుట్ర ఒకటి సినిమాలో ఉంచారట. ఈ సన్నివేశం అత్యంత వాస్తవికంగా చిత్రీకరించరాని ఈ నెల 30 న విడదలవుతున్న "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రం లో ఆ కుంభకోణం అసలు గుట్టురట్టువుతోందేమో చూడాలి. ఒకెవేల అలాంటిది జరిగితే, దీనిపై మన రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

     రామ్ గోపాల్ వర్మ ‘నయీమ్' :

    రామ్ గోపాల్ వర్మ ‘నయీమ్' :


    ఇటీవల తెలంగాణ పోలీసులు చంపిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎంత ప్రమాదకర పనులు చేశాడో అందరికీ తెలిసిందే. ఈ నయీమ్ ఏంచౌంతెర్ అనంతరం ప్రముఖ ధర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నయీమ్' సినిమా తీస్తానని ఒక పాటని కూడా విడుదల చేశాడు. అయితే నయీమ్ పాత్ర అంతకంటే ముందే దర్శనమివ్వబోతుందా అంటే ?

     అప్పట్లో ఒకడుండేవాడు:

    అప్పట్లో ఒకడుండేవాడు:


    అవుననే సమాధానం వినిపిస్తుంది. "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రంలో నయీమ్ పాత్ర కనబడబోతుందట. అందులో కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ 1990 దశకం లో చేసిన హత్యలు, కుట్రలని దర్శకుడు ఈ చిత్రంలో చూపించాడని సమాచారం. సొ అప్పట్లో రాష్ట్రాన్ని గడగడలాడించిన నయీమ్ పాత్రని మనం త్వరలోనే "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రంలో చూడబోతున్నామన్నమాట

    English summary
    Nara Rohits Appatlo Okadundevaadu creates Sanitation in Film Nagar... buzz is that the Movie having controversial things
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X