Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వావ్...సో సెక్సీ: అందమే ఆమె ఆస్తి
ముంబై: రామ్ గోపాల్ వర్మ ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన నథాలియా కౌర్.... డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ.
డిపార్టుమెంటు సినిమా విషయం అంతా ఎప్పుడో మరిచిపోయినా....నథాలియా అందాలను మాత్రం జనాలు ఇంకా మరిచిపోలేక పోతున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా టాలెంటు లేక పోయినా....తన హాట్ అండ్ సెక్సీ అందాలతో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది ఈ బ్రెజిల్ బ్యూటీ.
ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునేందుకు తనకున్న అందమైన ఆస్తులను ప్రదర్శిస్తోంది. నథాలియా హాట్ ఫోటోలు, ఇతర వివరాలు స్లైడ్ షోలో...
తెలుగులో నథాలియా
ఆ మధ్య తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘భాయ్' సినిమాలో కనిపించిన నథాలియా..... గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి' చిత్రంలోనూ నటిస్తోంది.
డిపార్టుమెంట్ ఐటం సాంగ్
డిపార్ట్ మెంట్ చిత్రంలోని ‘డన్ డన్' ఐటం సాంగులో నథాలియా సెక్సీ పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఈ పాటతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతాయని అనుకున్నారంతా. అయితే పరిస్థితి తారుమారైంది. నథాలియాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు.
సౌత్ సినిమాలపై
బాలీవుడ్లో తన కెరీర్ గ్రోత్ లేక పోవడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై, ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమపై దృష్టి సారించింది.
భవిష్యత్తుపై ఆశలు...
ఐటం గర్ల్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా...నటిగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తోంది నథాలియా. ఇందుకోసం చాలా కష్ట పడుతోంది. ఖాళీ సమయాల్లో యాడ్ ఫిల్మ్స్ చేస్తోంది.