twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ గీతం ఉండాల్సిందే... నిలబడకుంటే చర్యలు తప్పవా..??

    సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

    |

    సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందే జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ప్రారంభం కంటే ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ప్రదర్శించాలని ఆదేశాలిచ్చింది.

    జాతీయ జెండాను తెరపై ప్రదర్శించాలని పేర్కొంది. థియేటర్ లోని ప్రతి ఒక్కరూ విధిగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పింది. జాతీయగీతం, జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆదేశించింది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించనున్నారు.

     జాతీయగీతాన్ని:

    జాతీయగీతాన్ని:


    దేశభక్తి, జాతీయతా భావాలు ప్రతి పౌరుడిలో నిండి ఉండాలంటే జాతీయగీతాన్ని ఆల‌పించాల్సిన అవసరం ఎంత‌యినా ఉంది. దేశం ప‌ట్ల ఆరాధనా భావం, పూజనీయమైన భావం పెరిగేలా చేసే మ‌న‌ దేశ జాతీయగీతం ఇక‌పై ప్ర‌తిరోజు సినిమా హాళ్ల‌లో విన‌బోతున్నాం. జాతీయగీతంపై ఈ రోజు సుప్రీంకోర్టు ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

     జాతీయ‌తా భావం పెరుగనుంది:

    జాతీయ‌తా భావం పెరుగనుంది:


    ప్ర‌తి సినిమా థియేట‌ర్ల‌ో చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు త‌ప్ప‌ని స‌రిగా జాతీయగీతాన్ని ప్ర‌సారం చేయాలని పేర్కొంది. జాతీయగీతం, జాతీయ జెండాను ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వించాలని స్ప‌ష్టం చేసింది. దీంతో, ఇక‌పై విశ్వ‌క‌వి రవీంద్ర‌నాథ్ ఠాగూర్ రాసిన‌ జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యవిధాతా! గీతం ప్ర‌తి థియేట‌ర్ల‌లోనూ విన‌ప‌డ‌నుంది. సినిమాలే లోకంగా బ‌తుకుతున్న వారి మ‌దిలో సుప్రీం జారీ చేసిన ఈ ఆదేశాల‌తో జాతీయ‌తా భావం పెరుగనుంది.

     ప్రతి షో ముందు:

    ప్రతి షో ముందు:


    సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపనపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు. జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో ప్రేక్షకులు అందరూ కచ్చితంగా నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

     2003లో మహారాష్ట్ర గవర్నమెంట్:

    2003లో మహారాష్ట్ర గవర్నమెంట్:


    భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది.

     పలు వివాదాలకు కారణమైంది:

    పలు వివాదాలకు కారణమైంది:


    అయితే గతం లో ఈ విధానం పలు వివాదాలకు కారణమైంది. వికలాంగుల హక్కుల ఉద్యమనేత,ప్రముఖ రచయిత అయిన సలీల్ చతుర్వేదికి తమకు తాము దేశభక్తులమనుకునే వారి చేతిలో అవమానం ఎదురైంది. వెన్నెముకకు గాయం కావడం వల్ల కాళ్లు చచ్చుపడిపోయిన ఆయన వీల్ చైరుకే పరిమితమయ్యారు.

     రెచ్చిపోయింది:

    రెచ్చిపోయింది:


    ఇటీవల ఆయన గోవాలోని ఒక మల్టిపెక్సులో సినిమాకు వెళ్లారు. సినిమాకు ముందు జనగణమన ప్లే చేసారు. అంతా లేచి నిల్చున్నారు. కానీ, ఆయన నిల్చోలేకపోయారు. ఆయన వెనక కుర్చీల్లో కూర్చున్న ఒక జంట అది చూసి రెచ్చిపోయింది. ఆ వ్యక్తి వెనక నుండి సలీల్ ను కొట్టినంతపనిచేశాడు. ఆ మహిళైతే జనగణమన వస్తుండగానే నోరు పెద్దదిచేసుకుని థియేటర్ అంతా వినిపించేలా గగ్గోలుపెట్టింది.

     దేశభక్తి అంటే ఏమిటో:

    దేశభక్తి అంటే ఏమిటో:


    జనగణమన వినిపిస్తున్న సమయంలో అటు ఇటూ కదలరాదు. మౌనంగా నిలబడాలి. కానీ, ఆ జంట అలా చేయకుండా రచ్చ రచ్చ చేసారు. కానీ, ఆయన మౌనంగా ఉండిపోయారు. తరువాత ఈ ఘటనపై ఆయన మీడియా వద్ద ప్రస్తావించారు. ఘటనను వివరిస్తూ చలించిపోయారు. తన కుటుంబ సభ్యులు దేశ రక్షణ రంగంలో పనిచేసిన వారని, దేశభక్తి అంటే ఏమిటో, దాన్ని ఎలా, ఎప్పుడు ప్రదర్శించాలో తమకు తెలుసని ఆయన వాపోయారు.

     ఆవేదన :

    ఆవేదన :


    థియేటర్లలో జాతీయగీతాలపన అనే అంశంపై కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గీతం వస్తున్నసమయంలో నిల్చోలేనివారు అక్కడున్న వారి దాడుల నుండి కాచుకోవడానికి, తాము లేచి నిల్చోలేమని తెలిసేలా బ్యాడ్జీలు ధరించాలా అని ఆయన ప్రశ్నించారు. ఇది వికలాంగులను అవమానించడం కాదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

    English summary
    The Supreme Court Wednesday made playing of the national anthem mandatory before movie screenings in theatres across the country, underlining that it would “instill a sense of committed patriotism and nationalism” in citizens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X