twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాంబులా పేలిన ‘నాయక్’ శాటిలైట్ రైట్స్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం నిన్న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తెగ సంబర పడిపోతున్న నిర్మాతలకు మరో జాక్ పాట్ తగిలినట్లయింది. 'నాయక్' మూవీ శాటిలైట్ రైట్స్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు లేని విధంగా భారీ మొత్తం రాబట్టింది.

    ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం 'నాయక్' చిత్రం శాటిలైట్ రైట్స్ ప్రముఖ సౌతిండియా ఛానల్ జెమినీ టీవీ రూ. 7.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ గతంలోనే 'నాయక్' రైట్స్ కోసం రూ. 2.61 కోట్లు అడ్వాన్స్ చెల్లించిందని, తాజాగా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుందని అంటున్నారు.

    'నాయక్' చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించారు. రామ్ చరణ్ ...సిద్ధార్థ నాయక్, చెర్రీ అనే రెండు పాత్రల్లో కనిపించారు. నాయక్ పాత్ర సరసన అమలపాల్ నటించగా, చెర్రీకి జోడీగా కాజల్ నటించింది. చరణ్ తన కెరీర్లో చేసిన తొలి డ్యూయల్ రోల్ సినిమానే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇకపై చరణ్ డ్యుయల్ రోల్ సినిమాలు రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

    ఈ చిత్రంలో ఇంకా బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సంగీతం: తమన్, కెమెరా: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌ సాయి, కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ. నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.

    English summary
    
 Mega Power Star Ram Charan’s Nayak satellite rights bought for a whopping Rs. 7.5 Cr by Gemini TV. The TV channel had paid 2.61C as advance already. This is the highest ever price quoted for a movie in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X