»   » త్రిష ‘నాయకి’ టీజర్‌ (వీడియో)

త్రిష ‘నాయకి’ టీజర్‌ (వీడియో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రిష కీలక పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ సినిమా టీజర్‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు, చిత్ర యూనిట్ కలిసి విడుదల చేశారు. టీజర్ లో త్రిష కత్తితో ఒకరిని చంపటం ఆశ్చర్యం కనిపిస్తుంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

గొవి గోవర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గిరిధర్‌ మామిడిపల్లి నిర్మించారు. రఘు కుంచె సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

80వ దశకం నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను గిరిధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం త్రిష ఓ పాట పాడనుందని తెలిసింది. 3 నిమిషాల పాటు సాగే ఈ పాటను తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ త్రిష పాడబోతున్నారని తెలిసింది.

Nayaki  Telugu Official Teaser

ఈ పాటను త్వరలో రికార్డ్ చేయబోతున్నారు. తొలిసారి త్రిష పాడబోతున్న పాట ఎలా వుంటుందో తెలియాలంటే నాయకి విడుదల వరకు వేచి చూడాల్సిందే. హారర్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయాలని నిర్మాత గిరిధర్ సన్నాహాలు చేస్తున్నారు.

డిఫరెంట్‌ స్టైల్లో కనిపిస్తోన్న త్రిషకు అభినందనలు వెల్లువెత్తాయి. తనను నమ్మి ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్‌ చెబుతూ ఈ సినిమా ద్వారా తన కెరీర్లో మరో మంచి పాత్ర రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రఘుకుంచె ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ పూర్తికానుందని తెలుస్తోంది.

Nayaki  Telugu Official Teaser

సత్యం రాజేశ్, కోవై సరళ, జయప్రకాశ్, గణేశ్‌వెంకట్రామన్, మనోబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష నటించిన కళావతి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Nayaki Telugu Movie Official Teaser released. Trisha, Brahmanandam and Satyam Rajesh. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.
Please Wait while comments are loading...