»   » మాజీ లవర్ బర్త్ డే పార్టీలో నయనతార (ఫోటోస్)

మాజీ లవర్ బర్త్ డే పార్టీలో నయనతార (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార గతంలో తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం నడపడం అప్పట్లో ఓ సెన్సేషన్. ఇద్దరిరూ ఓ గదిలో రహస్యంగా రొమాన్స్ చేసుకోవడం, నయన పెదాలను శింబు కొరకడం లాంటి ఫోటోలో గతంలో ఆన్ లైన్లో లీక్ అయి హల్ చల్ చేసాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయిరు. ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ పలు చిత్రాల్లో నటించిన ఈ ఇద్దరూ విడిపోయిన తర్వాత కలిసి నటించలేదు.

ఇద్దరి మధ్య ఉన్న గత విబేధాలను పక్కన పెట్టి.... ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా...నిన్న(ఫిబ్రవరి 3) శింబు పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ పార్టీలో యూనిట్ సభ్యులతో పాటు నయనతార కూడా పాల్గొంది.

వాస్తవానికి నిన్న నయనతారకు హైదరాబాద్ లో వేరే సినిమా షూటింగ్ ఉంది. అయినా దాన్ని కాన్సిల్ చేసుకుని మరీ ఈ బర్త్ డే పార్టీకి హాజరైందట. దీంతో పాటు శింబు కోసం స్పెషల్ గా భారీ కేకును తయారు చేయించిందట. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శింబు-నయన


శింబు బర్త్ డే పార్టీలో నయనతార. ఇద్దరూ గత విబేధాలను పక్కన పెట్టి కలిసి నటిస్తున్నారు.

భారీ కేక్


శింబు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ తయారు చేయించారు. ఈ కేకును నయనతార తయారు చేయించినట్లు తెలుస్తోంది. యూనిట్ సభ్యుల సమక్షంలో శింబు పుట్టినరోజు వేడుక జరిగింది.

గ్రాండ్ పార్టీ


శింబు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసారు.

శింబు నయన


‘ఐదు నమ్మ ఆలు' చిత్రంలోని సీన్లలో ఓ లవ్లీ సీన్. రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
Nayanathara caught at simbhu's birth day Party. Nayantara made the day more special for him as she got a big cake ordered for her former lover.
Please Wait while comments are loading...