»   »  నయనతార ‘డోర’ భయం పుట్టిస్తోంది

నయనతార ‘డోర’ భయం పుట్టిస్తోంది

నయనతార ‘డోర’ భయం పుట్టిస్తోంది

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దాస్ దర్శకత్వంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కింది.

'డోర' అనే టైటిల్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

 Nayantara's Dora audio on Jan 2017

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.

ఇప్పటి వరకు వచ్చిన హారర్ సస్పెన్స్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను.

 Nayantara's Dora audio on Jan 2017

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకు ముస్తాబవుతున్నఈ చిత్ర ఆడియో వేడుకను నూతన సంవత్సరం.. జనవరిలో జరిపి, ఫిబ్రవరి లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము..అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

English summary
Versatile Actress Nayantara is playing lead role in the forthcoming women-centric film titled Dora has wrapped up its shoot and heading for a release in 2017.
Please Wait while comments are loading...