»   » కారు గిఫ్టు: నయనతార అతనితో ప్రేమలో పడిందంట!

కారు గిఫ్టు: నయనతార అతనితో ప్రేమలో పడిందంట!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార ప్రొఫెసన్ పరంగా ఎప్పుడూ టాప్ పొజిషన్లోనూ ఉంటూ వస్తోంది. అదే సమయంలో ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాల విషయంలోనూ ఆమె ఓ అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. ఆ విషయం అందరికీ తెలిసిందే.

అప్పట్లో శింబుతో ఆమె చాటుమాటు సరసాలు....ఫోటోల రూపంలోబయటకు కూడా లీక్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడి కొంత కాలం సహజీవనం చేసింది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడం అప్పట్లో ఓ సంచలనమే. పెల్లి కూడా చేసుకోవాలనుకున్నాకు. ఏమైదో ఏమోతెలియదుకాని ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది.

గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటూ తన సినిమా కెరీర్ మీదనే దృష్టి పెట్టిన నయనతార మళ్లీ ప్రేమలో పడ్డట్లు టాక్. ఈసారి ఈ ప్రేమ ప్ర‌యాణం.. పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్ల‌నుందా?? ప‌్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న హాట్ వార్త ఇది. ఈసారి ఆమె ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిపోయింద‌ని న్యూస్‌. వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం ఇంట్లో కూడా తెలిసిపోయింద‌ట‌. వాళ్లూ పాజిటీవ్ గా స్పందించ‌డంతో.. న‌య‌న పెళ్లికి రెడీ అయిపోయింద‌ని చెప్పుకొంటున్నారు.

ఆయన ఎవరో కాదు శింబు, వరలక్ష్మి నాయికా నాయకులుగా నటించిన పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన విఘ్నేష్ శివనే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నయనతార ధనుష్ నిర్మిస్తున్న నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరో. ఈచిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా సెట్లో ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో గడిపి వచ్చినట్లు కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనికి ఓ ఖరీదైన కారు గిఫ్టుగా కొనిచ్చిందని టాక్. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

నయనతార-శింబు

గతంలో నయనతార శింబుతో లవ్ ఎఫైర్ నడిపింది. వల్లభన్ సినిమా సమయంలో ఇద్దరూ క్లోజ్ అయ్యారు. తర్వాత విడిపోయారు.

నయనతార-ప్రభుదేవా

నయనతార-ప్రభుదేవా ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చి పెటాకులైన సంగతి తెలిసిందే. వీరు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

నయన-ఆర్య

తమిళ హీరో ఆర్యతో నయనతారకు ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తుల వచ్చాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయనతార-రాజు

నయనతార మేకప్ మేన్ రాజుతో లింకప్ వేస్తూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయన-ఉదయనిధి స్టాలిన్

నయనతార, ఉదయనిధి కలిసి ఓ సినిమాలో నటించినపుడు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయన-మోహన్ లాల్

నయనతారకు, మోహన్ లాల్ కు లింకప్ పెడుతూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయనతార-రానా

నయనతార, రానా మధ్య లింకప్ ఉన్నట్లు అప్పట్లో టాక్. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయనతార, నాగార్జున

నయనతార, నాగార్జున మధ్య ఎఫైర్ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ మాత్రమే అని తేలింది.

నయనతార-విఘ్నేష్ శివన్

నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Here is the hottest gossip of the season, or is it something more than just a gossip? According to the latest buzz, Nayantara has found the love of her life and it is the 29 year old director Vignesh Shivan.
Please Wait while comments are loading...