Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బీరు వీడియో: మీడియాపై నయనతార ఫైర్....
హైదరాబాద్: నయనతార రోడ్డు పక్కన ఓ వైన్ షాపులో బీరు కొంటున్న వీడియో ఒకటి ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అసలు నయనతార ఇలా పబ్లిగ్గా బరితెగించడం ఏమిటి? అంటూ ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అయితే అది రియల్ లైఫ్ వీడియో కాదు...‘నానుమ్ రౌడీథాన్' అనే తమిళ సినిమా షూటింగుకు సంబందించిన వీడియో అని తర్వాత తేలింది.
అయితే ఈ వీడియోను రియల్ వీడియోగా, తానే స్వయంగా వెళ్లి బీరు కొన్నట్లు మీడియా ప్రచారం చేయడంపై ఆమె మండి పడింది. నేను జనాల్లోకి వెళితే ఇట్టే గుర్తు పట్టేసారు. అలాంటపుడు నేను అలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తాను. సినిమా షూటింగ్ సమయంలో ఎవరో సెల్ ఫోన్లో తీసారు. అయినా నేను వెళ్లి బీరు కొన్నానంటే ఎలా నమ్ముతారు...ఈ వీడియోపై ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు అంటూ నయనతార ఫైర్ అయింది. ప్రస్తుతం యూట్యూబు నుండి ఆ వీడియో తొలగించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమాలోని ఈ సీన్ ని కావాలని లీక్ చేసారో..మరేమో కాని ఇప్పుడు ఈ సీన్ తమిళ, తెలుగు లో హాట్ టాపిగా మారింది. విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న చిత్రం ఇది. పోడా పొడి ఫేమ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
మొత్తానికి ఈ వీడియో వివాదం ముగియంతో ఆమె అభిమానులు రిలాక్స్ అయ్యారు. నయనతార ఇలాంటి వివాదాల బారిన పడకుండా కలకాలం తమకు వెండితెరపై అందాల విందు చేయాలని వారు ఆశ పడుతున్నారు.