twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో "నీర్జా" మేకర్స్ ..., అసలైన నీర్జా కుటుంబానికి అన్యాయం వల్లే

    నీర్జా బయోపిక్ తెరకెక్కించే ముందు, వచ్చిన లాభాల్లో 10 శాతం ఇచ్చేలా నీర్జా బానోట్ కుటుంబసభ్యులతో ఒప్పందాన్ని చేసుకున్నారట చిత్ర నిర్మాతలు. ఇప్పటివరకూ నీర్జా కుటుంబసభ్యులకు డబ్బులు ఇవ్వలేదట.

    |

    ఇటీవలే జాతీయ పురస్కారాల్లో సోనమ్ కపూర్ నటించిన 'నీర్జా' చిత్రం సత్తా చాటింది.సోనమ్ కపూర్ లో ఎంత గొప్ప న‌టి ఉంద‌నే విష‌యాన్ని నీర్జా సినిమా నిరూపించింది. రామ్ మ‌ద్వానీ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ సంచ‌ల‌నం రేపింది. ఓ సినిమాను ఇంత రియ‌లిస్టిక్ గా తీయొచ్చా.. సోన‌మ్ క‌పూర్ లో ఇంత‌టి న‌టి దాగుందా అని సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

    సినిమా

    సినిమా

    ఆ ఆశ్చర్యం లోనే సినిమా తెగ చూసేసి నిర్మాతల జేబులు ఇబ్బడి మబ్బడి గా నింపేసారు. అయితే నీర్జా భానోత్ జీవిత కథనీ, ఆమె వీరో చిత మరణాన్నీ క్యాష్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకోనందుకు లేగల్ గా సమస్యలని ఎదుర్కో బోతున్నారు.

    22 యేళ్ల నీర్జా బానోట్ కథే

    22 యేళ్ల నీర్జా బానోట్ కథే

    గత ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ 'నీర్జా'. 1986లో పాకిస్థాన్ కరాచీలో హైజాక్ అయిన 'ప్యాన్ ఎ.ఎమ్. ఫ్లైట్ 73' కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ బోయింగ్ ఫ్లైట్‌లో 359 మంది ప్యాసెంజర్స్‌ను రక్షించి హైజాకర్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కేబిన్ క్రూ మెంబర్ 22 యేళ్ల నీర్జా బానోట్ కథే 'నీర్జా' చిత్రం.

    ప్యాన్ ఎ.ఎమ్. ఫ్లైట్ 73

    ప్యాన్ ఎ.ఎమ్. ఫ్లైట్ 73

    1986 సెప్టెంబర్ 5న కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారతదేశం లోని ముంబై నుంచి వచ్చిన "ప్యాన్ ఎ.ఎమ్. ఫ్లైట్ 73" అనే పాన్అమ్ సంస్థకు చెందిన విమానం లాండ్ అయ్యింది మరికొద్ది నిమిషాల్లో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతూండగా లిబియా మద్దతు కలిగిన అబూ నిదాల్ సంస్థకు చెందిన నలుగురు హైజాకర్లు విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    17 గంటల సేపు

    17 గంటల సేపు

    ఫ్లైట్ హైజాక్ అనే మాట వినగానే అమెరికన్ జాతీయులైన విమానం పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ ముగ్గురూ తమ భాద్యతలనూ,ప్రయాణీకుల ప్రాణాలనూ వదిలేసి తాము మాత్రం తప్పించుకున్నారు. దాదాపు 17 గంటల సేపు ఏవేవో కారణాలతో ఆమె హైజాకర్లను నిలువరించారు.ఎంతో అనుభవం ఉన్న ఫ్లైట్ అటెండెంట్లు కూడా తడబడే అటువంటి విపత్కర పరిస్థితిలోనూ రెండు పదుల వయసులో ఉన్న యువతి చాకచక్యంగా వ్యవహరించారు.

    రామ్ మధ్వాని

    రామ్ మధ్వాని

    దాదాపుతన ప్రాణాలను కాపాడుకునే స్థితిలో ఉండి కూడా నీరజ తనున్న స్థానం నుంచి కదలకుండా ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డుకట్ట వేసింది.... రామ్ మధ్వాని తెరకెక్కించిన ఈ బయోపిక్‌కు ఇటీవలే జాతీయ పురస్కారాల్లో అవార్డుల పంట పండింది. ఆనాటి సాహస గాథ ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చింది.. అయితే ఇక్కడ నిర్మాతలు నీర్జా కుటుంబం తో చేసుకున్న ఒక ఒప్పందం ఉంది...

    ఫాక్స్ స్టార్ స్టూడియోస్

    ఫాక్స్ స్టార్ స్టూడియోస్

    అతుల్ కస్బేకర్ నిర్మాణంలో 'నీర్జా' చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ పంపిణీ చేసింది. ఇక ఈ బయోపిక్ తెరకెక్కించే ముందు వచ్చిన లాభాల్లో 10 శాతం ఇచ్చేలా నీర్జా బానోట్ కుటుంబసభ్యులతో ఒప్పందాన్ని చేసుకున్నారట చిత్ర నిర్మాతలు. అయితే సినిమా విడుదలయి ఘన విజయాన్ని సాధించినా, ఇప్పటివరకూ నీర్జా కుటుంబసభ్యులకు డబ్బులు ఇవ్వలేదట.

    సరికాదేమో...

    సరికాదేమో...

    దీంతో ఇప్పుడు నీర్జా బానోట్ కుటుంబసభ్యులు 'నీర్జా' నిర్మాతలపై లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. మరి సోనమ్ కపూర్ నిర్మాతలు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి. సినిమాలో ఆమె జీవితాన్ని లాభాల కోసం వాడుకున్నారు, డబ్బూ పేరూ వచ్చాయి కానీ ఇవ్వాల్సిన వాటా 10% అన్నది పెద్ద మొత్తం కాకున్నా కూడా తప్పించుకునే ప్రయత్నం చేయటం సరికాదేమో...

    English summary
    Neerja Bhanot's family is unhappy with the makers of the film for not honouring their commitment to share 10 per cent of the profits with the Neerja Bhanot Trust and the family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X