»   » నయనతార మోజులో పడి ఆరునెలల్లో అంబానీగా ఎదిగాడు

నయనతార మోజులో పడి ఆరునెలల్లో అంబానీగా ఎదిగాడు

Posted by:

Nayantara
ఆర్య, నయనతార జంటగా బాస్ ఎన్ గిర భాస్కరన్ టైటిల్ తో రూపొంది విజయం సాధించిన చిత్రం ఇప్పుడు నేనే అంబాని...ఆరు నెలల్లో అనే టైటిల్ తో డబ్బింగై మనముందుకొస్తోంది. ఎస్ ‌వీఆర్ మీడియా వారు తెలుగులోకి అనువదించిన ఈ చిత్రం నెల17న విడుదల కానుంది. ఈ చిత్రం ఫన్ తో కూడిన ప్రేమ కథగా సాగుతుంది. హీరో ఆర్య...ఆరు నెలల్లో నేనే అంబాని అవుతా అంటూ ఛాలెంజ్ చేస్తాడు. అందుకు అతను అనుసరించిన మార్గాలేమిటన్నది కామిడీగా చూపెట్టడం జరుగింది. ఎం.రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి నిర్మాత శ్రీమతి శోభారాణి మాట్లాడుతూ...తమిళ్‌ లో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయి. వాణిజ్య అంశాలు కలగలిసిన ప్రేమకథా చిత్రమిది. ఆర్య నటన, నయనతార అందం ఈ చిత్రానికి హైలైట్. ఇటీవల విడుదలైన పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోంది. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఆర్య, నయనతార కాంబినేషన్‌ లోని సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సంతానం, విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకర టి, సంగీతం: యువన్ శంకర్‌ రాజా, కెమెరా: శక్తి శరవణన్.

Please Wait while comments are loading...