twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "అఆ"పై కులవివాదం: తప్పు దర్శకుడిదా, నిర్మాతదా...

    |

    త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి ఆఆ సినిమాపై కుల వివాదం రగులుతోంది. ఓ కులాన్ని కించపరుస్తూ, అది తెలుగు రాష్ట్రాల్లో బలమైన కులాన్ని కించపరుస్తూ సంభాషణలు, దృశ్యాలున్నాయని నెటిజన్లు దుమ్ముత్తిపోస్తున్నారు.

    హాస్యం ఆడవాళ్లని, వికలాంగులని కించపరిచిన దృశ్యాలు కూడా సినిమాల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర యాషనీ, తెలంగాణ యాసనీ కించపరుస్తూ కూడా సినిమాల్లో దృశ్యాలు ఉన్నాయి. కింది కులాలుగా భావించే వారిపై ఈ హాస్యం వెర్రితలలు వేసిన సందర్భాలు ఉన్నాయి.

    ఆడవాళ్ల మీద అసభ్య పదాల సంభాషణలతో ఉన్న కామెడీ ఇంకా ఆగలేదు. ఇక పోతే చివరగా కులాలని పట్టుకొని వాటినుంచీ హాస్యం పింఢటం మొదలు పెట్టారు. అది కూడా వెర్రితలలు వేస్తున్న సంఘటనలున్నాయి.

    చెర్రీకి కథ చెప్పు... నేనే నిర్మిస్తా: త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్!చెర్రీకి కథ చెప్పు... నేనే నిర్మిస్తా: త్రివిక్రమ్‌తో పవన్ కళ్యాణ్!

    trivikram

    బ్రాహ్మణులు ఈ హాస్యానికి మొదటగా బలయ్యారు.. అవధానీ, ఆచారీ వంటి కామెడీ పాత్రలు సర్వసాధారనమయ్యాయి ఆమధ్య... ఇక పోతే రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమాలు రెడ్డి సామాజిక వర్గంలో ఎంతటి మార్పులు తెచ్చాయో, ఎంతగా రాయలసీమ ప్రాంత రెడ్ల మీద క్రూరులు అనే ముద్ర వేసాయో ప్రత్యేకంగా చెప్పే పని లేదు...

    రెండు అగ్రకులాల మధ్య ఉన్న వైరుధ్యంతో ఆ సినిమాలో ఓ అగ్రకులాన్ని కించపరిచారని అంటున్సారు. త్రివిక్రం అంటే ఒక ప్రత్యేకాభిమానం ఉంది ప్రేక్షకులకి. ఎక్కడా వెకిలితనం కనిపించకుండా మంచి హాస్యాన్ని అందిస్తాదన్న పేరుంది త్రివిక్రమ్ కే...

    మహేష్-త్రివిక్రమ్ మీద మరీ ఇంత చెత్త ఇమాజినేషనా? మహేష్-త్రివిక్రమ్ మీద మరీ ఇంత చెత్త ఇమాజినేషనా?

    అయితే ఈ మధ్య వచ్చిన... "అ ఆ" సినిమాతో ఆపవాదు కూడా మూటకట్టుకున్నాడీ మాటల మంత్రికుడు. ఈ సినిమాలో ఒక దొంగకి పెట్టిన పేరు ఒక సామాజిక వర్గాన్ని సూచించేదిగా ఉంది. అంతే కాదు రెండు సీన్లలోనూ అవసరం లేకున్నా పదే పదే ఆ కులం పేరుని ప్రస్తావనకు తెస్తూ పదే పదే కించపరిచారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు... త్రివిక్రం పై విరుచుకు పడుతున్నారు...

    అయితే ఈ పేరు విషయంలో తన తప్పేమీ లేదని త్రివిక్రమ్ సర్దిచెప్పుకుంటున్నారట. అయితే, నిర్మాతనే చేయించాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలుగురాష్ట్రాల్లో పెద్దవైన ఆ రెండు కులాలమధ్యా ఎప్పటినుంచో ఉన్న పరస్పర వైరం కారణంగా అది చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. తమ సామాజిక వర్గాన్ని కావాలని అవమానించారని మరో అగ్రకులంవాళ్లు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ వివాదం సినిమా వసూళ్ళ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి...

    English summary
    Director Trivikram insulted us by naming a thief as indicating a cast..... serious comments on Trivkram and a..aa movie Teem
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X