»   » ఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నాగబాబు కూతురు

ఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నాగబాబు కూతురు

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక. నాగబాబు కూతురిగా తెరంగ్రేటం చేస్తున్న ఈ అమ్మడు ‘ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ రంగంవైపు రావడంపై నిహారిక ఇటీవల మీడియాతో స్పందించారు.

నాగబాబు కూతురు నిహారిక ‘ఒక మనసు' ఫస్ట్ లుక్ (ఫోస్టర్)
కాలేజీ రోజుల నుండి సినిమా నిర్మాణ రంగంలోకి రావాలని డిసైడ్ అయ్యాను, అయితే నటన వైపు ఎప్పుడు ఇంట్రస్టు కలిగిందో, ఎందుక కలిగిందో తెలియదు. బహుషా ఫ్యామిలీలో అంతా నటులే ఉండటం వల్ల ఇలా అయి ఉండొచ్చు అన్నారు నిహారిక. హీరోయిన్ అవుతానని చెప్పగానే ఇంట్లో మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరికి వారు సినిమా రంగంలో తమ తమ అనుభవాల గురించి చెప్పారు. నీకు ఇష్టమైతే ఓకే... అని చెప్పారని నిహారిక తెలిపారు.

 Niharika Konidela  about her first movie

తొలి సినిమా ఒప్పుకునే సమయంలో చాలా కేర్ తీసుకున్నాను. మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వస్తున్నాను కాబట్టి, అందంగా ఉంటాను కాబట్టి తొలి సినిమా చూడటానికి జనాలు వస్తారు. రెండో సినిమాకు అలా జరుగదు. కానీ మొదటి సినిమాలో వేస్ట్ అనిపించుంటే అంతే సంగతులు. అందుకే మొదటి సినిమా ఎంపిక సమయంలో చాలా ఆలోచించాను.

‘ఒక మనసు' స్క్రిప్టు ఏ యాక్టర్ కైనా ఒక సవాల్ లాంటిది. అందుకే దీన్ని ఎంచుకున్నాను. మా పెదనాన్న, నాన్న, అన్నయ్యలు, బావలతో పాటు మా కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులు అందరూ ఈ సినిమా చూసి బెస్ట్ అనేలా ఉండాలి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయిగా ఎవరూ తలదించుకునేలా సినిమా చేయను అని నిహారిక స్పష్టం చేసారు.

English summary
Niharika Konidela is an Indian film actress who forays from Chiranjeevi's family. She is soon debuting as actress with the film Oka Manasu. The film is slated for a worldwide release in Summer 2016.
Please Wait while comments are loading...