twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయిక్, సుకుమార్ ఇద్దరూ ఫోన్ చేసారుట

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకులు వి వి వినాయిక్, సుకుమార్ ఇద్దరూ ఫోన్ చేసి మెచ్చుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు అనుభవిస్తున్నాడు హీరో నిఖిల్. తన తాజా చిత్రం కార్తీకేయ ని చూసి ఈ దర్శకులు ఇద్దరూ ఫోన్ చేసారని మురిసిపోతూ ట్వీట్ చేసారు.

    ''హ్యాపీడేస్‌', 'స్వామి రా రా' తరవాత నాకు లభించిన పెద్ద విజయమిది. నా కెరీర్‌కి బూస్ట్‌లా పనిచేస్తుంద''న్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'కార్తికేయ'. స్వాతి కథానాయిక. చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    నిఖిల్‌ మాట్లాడుతూ ''దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చింది. సంగీతం, కెమెరా పనితనం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. విజయంలో తొలి భాగం రావు రమేష్‌గారికే. ప్రచార చిత్రాల్లో ఆయన పలికిన సంభాషణలు హిప్నటైజ్‌ చేశాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయ''న్నారు.

    ''ఇది కార్తీకమాసం. అయితే 'కార్తికేయ' రాకతో కార్తికేయ మాసం అయిపోయింది'' అని తనికెళ్ల భరణి చమత్కరించారు. రావు రమేష్‌ చెబుతూ ''ఈ సినిమాను నిఖిల్‌ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. వినోదం, టెన్షన్‌ కలగలిపిన ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింద''న్నారు. ''అందరి సహకారంతోనే ఇంత మంచి సినిమా తీయగలిగా'' అన్నారు దర్శకుడు.

    Nikil Happy with Vinayak and Sukumar Phones

    ''సినిమా విడుదలకు ముందు పడిన టెన్షన్‌ అంతా ఫలితం చూశాక మాయమైంద''ని నిర్మాత శ్రీనివాస్‌ బొగ్గారం చెప్పారు. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ ''కార్తికేయ నేపథ్య సంగీతం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేశా. సినిమా చూసినవాళ్లంతా నేపథ్య సంగీతం బాగుందని మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింద''న్నారు.

    చిత్రం కథేమిటంటే... మెడికో కార్తీక్(నిఖిల్) ది ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి ఎంతదూరమైనా వెళ్లే మనస్తత్వం. అలాంటి కార్తీక్... మెడికల్ క్యాంప్ కోసం ... ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లోని సుబ్రహ్మణ్యపురం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊళ్లో మూతబడిన సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి ఉంటుంది. ఆ గుడికో మిస్టీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతీ కార్తీక పౌర్ణమికి గుడి మొత్తం ప్రకాసిస్తూంటుంది. మూతబడిన ఆ గుడిని తెరవాలని ప్రయత్నించేవారంతా పాము కాటుతో మరణిస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఎలా స్పందించాడు. ఆ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందనేది,కథలో వల్లి(స్వాతి) పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

    English summary
    Nikhil tweeted: The compliments flowing in 4 karthikeya ... Top directors have called and appreciated the effort... Especially VV VINAYAK sir nd SUKUMAR Sir tollywood, nikhil, colours swathi, karthikeya, నిఖిల్, కలర్స్ స్వాతి, టాలీవుడ్, కార్తికేయ
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X