»   » పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేపే టీజర్ రిలీజ్

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేపే టీజర్ రిలీజ్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విజుువల్ టీజర్ ని రేపు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిఖిల్... ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నందితను ఎంచుకొన్నారు. ఓ ప్రత్యేక పాత్రలో అంజలి నటించనుంది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. అదే విషయాన్ని ఖరారు చేస్తూ చిత్ర రచయిత కోన వెంకట్ సైతం ట్వీట్ చేసారు.

స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆడియన్స్ కు మేము మంచి ప్రొడక్ట్ ని ఇస్తామని ఆశిస్తున్నాము అన్నారు.

 Nikil's Film  1st Luk Visual Teaser of  is going 2 be Unveiled by  Pawan

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉంటాయంటున్నారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం అనుభవించే కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఇండియా వచ్చి బీహార్లో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. దీంతో రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను బీహార్ లోనూ పూర్తి చేశారు. మరి డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఖాతాలో... ఈ శంకరాభరణం కూడా మరో విజయంగా నిలుస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
kona venkat tweeted :"Powerstar is going to release the 1st teaser of "Shankarabharanam" tmrw mrng.. My heart full thanks to him 🙏"
Please Wait while comments are loading...