twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్ 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నితిన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. యామి గౌతమ్‌ హీరోయిన్. ప్రేమ్‌ సాయి దర్శకుడు. గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ సంస్థ తెరకెక్కించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ర గీతాల్ని ఈ నెల 23న విడుదల చేయనున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Nithiin's Courier Boy Kalyan story line

    ప్రముఖ నిర్మాత గౌతమ్ మీననన్ ఈ 'కొరియర్‌ బోయ్‌ కల్యాణ్‌'కు నిర్మాతగా మారారు. ఈ నెల 19న చిత్ర పాటలు విడుదలవుతున్నాయి. త్వరలో చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తామని నటుడు నితిన్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్‌ హీరోయిన్ గా గా నటిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 11 న చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని సమాచారం.

    గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు. అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు నటించారు.

    ఇంతకు ముందు విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు....

    English summary
    Nithiin's CourierBoyKalyan releases on Sept 11th & audio launch on Aug 19th !!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X