twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబద్దం ఆడితే అతికినట్టుండాలి కానీ....! "లై" రివ్యూ

    మొత్తం మీద మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే ఎక్కే ఈసినిమా కొంతలో కొంత మాస్ ని కూడా మెప్పించగలిగితే ఈ వారం హిట్ ల జాబితాలో చేరొచ్చు...

    |

    రేటింగ్ (2.75/5)

    నితిన్... దాదాపు ఏ తెలుగు హీరోకీ రానంత క్రైసిస్ ని ఎదుర్కొని కూడా తానేమిటో నిరూపించుకున్న యువ నటుడు. అతని వయస్సులో కెరీర్ పూర్తిగా సెట్ కాకముందే నితిన్ కి ఎదురైన ఫ్లాప్ లు మామూలువి కాదు. దాదాపు నితిన్ పని ఇక అయిపోయిందీ అనుకున్న టైం లో మళ్ళీ లేచి నిలబడ్డాడు. టాలీవుడ్ కి కావాల్సిన నటన అనే "స్టఫ్" తో మళ్ళీ ఎదిగాడు.

    ఒక్కొక్క సినిమానీ ఎటువంటి పెద్ద అంచనాలు లేకుండానే రిలీజ్ తర్వాత సైలెంట్ హిట్ అన్న టాక్ తో తన స్టామినా తో సినిమాని నడిపించగల స్థాయి కి ఎదిగాడు. అయితే ఈసారి మళ్ళీ స్టైలిష్ లుక్ తో వచ్చి "యావరేజ్ కంటే తక్కువే" అనిపించుకునేలా తయారయ్యాడు. సారీ...! సినిమాని హను రాఘవపూడితో కలిసి అలా తయారు చేసాడు.

    చాలా అంచనాలతో వచ్చింది "లై" ఇదివరకు ఎన్నడూ లేనంత స్టైలిష్ లుక్ తో నితిన్, స్ట్రైట్ సినిమాలో విలన్ గా చేసిన నిన్నటితరం యాక్షన్ కింగ్ అర్జున్, టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ఫీల్ ఉండే సినిమా అందాల రాక్షసీ, నానీ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా "కృష్ణగాడి వీర ప్రేమ గాథ" లాంటి సినిమాలని తీసిన హను రాఘవపూడి దర్శకత్వం.... ఇవన్నీ ఉంటే ప్రేక్షకుడు ఎంత ఎక్స్పెక్ట్ చెస్తాడు...? మరి ప్రేక్షకుడు కొరుకున్నది దొరికిందా? లై "నిజంగా" ఎంత ఆకట్టుకోగలిగిందీ అన్నది ఇప్పుడు చూద్దాం...

    కథ:

    కథ:

    అబద్ధాల మీద మాత్రమే బతకగలం అని చిన్నతనం నుంచే మైండ్ ని ఫిక్స్ చేసుకున్న ఒక అబ్బాయి జీవితం మొత్తం అబద్ధాలతో నింపేసుకుంటాడు సత్యం (నితిన్) పేరు మాత్రమే సత్యం కానీ ఎప్పుడూ నిజం చెప్పడు. ఎలాంటి భాధ్యతలు లేని కుర్రాడు. పెద్దింటి అమ్మాయిని పెళ్లాడాలనే ఆలోచనతో ఉన్న సత్యానికి చైత్ర (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. ఒక విచిత్రమైన కారణం (చెప్తే క్యామిడీకంటే ఎక్కువ నవ్వుతారు) తో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న చైత్ర పిల్ల మన సత్యం తో కలిసి యూఎస్ ట్రిప్ కి బయల్దేరుతుంది.

    Recommended Video

    Nithin LIE Movie Public Review
    విలన్ పద్మనాభం (అర్జున్)

    విలన్ పద్మనాభం (అర్జున్)

    పాపం అబద్దాలే కాకుండా మనోడు మాంచి స్టైలిష్ గా కూడా కనిపించటం తో ఎంచక్కా ఇద్దరు ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రేమలో పడతారు. ఇంతా ప్రేమ లోపడ్డాక విలన్ కూడా "ఉండాలికాబట్టి" ఇక వీరిమధ్యన విలన్ పద్మనాభం (అర్జున్) వస్తాడు. ఇక అంతలోనే ఇంతలోనే స్టోరీలో ఊహించని ట్విస్ట్ (నిజానికి ఇది ఊహించగలిగే ట్విస్టే) వచ్చేసి సినిమాని మలుపు తిప్పేసి పోతుంది.

    అద్భుతమైన ట్విస్ట్

    అద్భుతమైన ట్విస్ట్

    అనాధగా పెరిగి లైఫ్ మీద పెద్దగా ఫోకస్ లేని ఇతను ఆ అమ్మాయి కారణంగా ఒక ఇబ్బంది లో ఇరుక్కుని ఇంటర్వెల్ లో తానేంటో , అతని కుటుంబం ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఇక సత్యం ఆ మలుపులు తురుగుతూ ఫైటింగులు చేస్తూ క్లైమాక్స్ దాకా వెళ్ళిపోతాడు..? అసలు ఈ విలన్ ఎవరు..? ఆ పద్మనాభానికీ ఈ అబద్దాల సత్యానికీ ఎందుకు గొడవొచ్చిందీ,? వీరి మధ్య ఏం జరిగింది అన్నది అసలు కథ. నిజానికి ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బాక్సులు పేలిపోయే కథే ఇది....

    నటీనటుల పర్ఫార్మెన్స్:

    నటీనటుల పర్ఫార్మెన్స్:

    ఇప్పటి వరకూ మనం చూసిన నితిన్ ఒకటైతే లై లో కనిపించే అసత్యాల "సత్యం" ఒకెత్తు. స్టైలిష్ లుక్ లోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ విపరీతమైన ఈజ్ కనబరిచాడు, ఇక ఫైట్స్ లో ఇరగదీసాడనే చెప్పుకోవాలి యావరేజ్ గా మొత్తం సినిమా సక్సెస్ లో భాగం ఇవ్వాల్సి వస్తే 50% ఒక్క నితిన్ కే ఇవ్వొచ్చు (ఈ సినిమా వరకూ), ఇక ఇంకో అట్రాక్షన్ నిన్నటి తరం యాక్షన్ కింగ్ అర్జున్ అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ హీరోగా రాణించి ఇప్పటికీ ఇంకా హీరోగా నటిస్తున్న అర్జున్ ఈ సినిమాలో పూర్తి విలన్ గా కనిపించి మెప్పించాడు. నిజానికి నితిన్ నటన ఎక్కువగా నచ్చటానికి అర్జున్ ని మించి పెర్ఫార్మెన్స్ చూపించాలన్న తపన అనికూడా అనుకోవచ్చు.

    సినిమాకి హైలెట్

    సినిమాకి హైలెట్

    ఇక మధ్యలో వచ్చే కత్తి యుద్దం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చుఇ. శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ కి అర్జున్ ఒక సపోర్టింగ్ రోల్ లో కనిపించాడు ఇప్పుడు మాత్రం విలన్ గాచేసాడు. రెండుసార్లూ అర్జున్ తన స్థాయి నటన నే కనబరిచాడు. కానీ అప్పటి నితిన్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న నితిన్ కి చాలాతేడా ఉంది. ఆ మెచ్యూరిటీని ఈ జీగా గుర్తుపట్టేయొచ్చు. ఇక మేఘా ఆకాశ్ విషయానికి వస్తే పాపం ఈ ఇద్దరిమధ్యా ఆమె చాలానే కష్టపడింది ఆఖరికి తన మార్క్ ని చూపించేలా మెప్పించగలిగింది.

    మంచి నటన కనబరిచారు

    మంచి నటన కనబరిచారు

    ఈ మూడు పాత్రలు తప్ప పెద్దగా చెప్పుకోదగిన పాత్ర ఏదీ లేదనే చెప్పాలి. ఇక శ్రీరాం, అజయ్, నాజర్, రవి కిషన్, బ్రహ్మాజి, పృధ్విరాజ్, బ్రహ్మానందం అంతా "కీలకమైన" పాత్రలే అయినా వారి పరిధులమేరకు పరిమితం అయిపోయారు. మరీ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఏం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పట్లాగే "మంచి నటన కనబరిచారు". మొత్తానికి తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ యాక్టర్స్ ను ఎంపిక చేసుకున్నాడు హను రాఘవపూడి.

    టెక్నికల్ టీమ్:

    టెక్నికల్ టీమ్:

    సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్ లు, థ్రిల్లింగ్ గా సాగే సీక్వెన్స్ లతో సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగినా ఆ మొత్తం ఫీలింగ్ ని క్లైమాక్స్ లో శుబ్రంగా తుడిచి పెట్టేసాడు. క్లైమాక్స్ బబుల్ గం కంటే కాస్త ఎక్కువే సా...గుతుంది. అయితే యువరాజ్ సినిమాటోగ్రఫీ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. తన కష్టం తో సినిమాకి మంచి లుక్ తెచ్చాడు. 14 రీల్స్ నిర్మాణ విలువలగురించి ఇప్పుడు కొత్తగా చెప్పే పని లేదు రిచ్ గా తీసిన సినిమా అన్న ఫీలింగ్ ప్రతీ ఫ్రేం లో కనిపించి తీరుతుంది.

    మణిశర్మ

    మణిశర్మ

    ఇక మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ కంటే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మరో బ్యాక్ బోన్ అనుకోవాలి. మణిశర్మ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ప్రత్యేకమో మరో సారి తెలుస్తుంది. ఇక ఎడిటింగ్ విషయం లోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఎస్.ఆర్ శేఖర్ చేసిన వర్క బావుంది. కానీ క్లైమాక్స్ ని సాగదీత అని అనిపించకుండా కాపాడలేకపోయాడు. అయితే ఇక్కడ ఎడిటర్ కంటే దర్శకుడి తప్పే ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇన్ని అద్బుతమైన ప్లస్ లని కూడా సరైన దిశలో నడిపించకపోవటం అన్న ఒక్క మైనస్ సినిమా మెడలో రొటీన్ ఫైటింగుల సినిమా అన్న ట్యాగ్ పడిపోయింది.

    విశ్లేషణ:

    విశ్లేషణ:

    టాలీవుడ్ లో లై లాంటి సబ్జెక్ట్ లు కొత్తవి కాదు కానీ ఈసారి వచ్చినన్ని మలుపులతో, ఫీల్ గుడ్ లవ్ ట్రాక్ తో బాగా రాసుకున్నారు కథని, సినిమా టైటిల్ ప్రకారంగానే లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమిటీ ఈ మూడు అంశాలు సినిమాలో ఉన్నాయి. హను రాఘవపూడి రాసుకున్న కథ కథనాలు మేజర్ ప్లస్ పాయింట్స్. కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ కు నచ్చే సినిమా అవ్వాల్సిందే. కానీ ఇప్పుడున్న పోటేఎలో యావరేజ్ కంటే బెటర్ అన్న స్థాయికి మాత్రమే చేరుకోగలుగుతుంది.

    మొదటి సినిమా తోనే

    మొదటి సినిమా తోనే

    చాలా నీట్ గా ప్రతి విషయాన్ని డీటేల్డ్ గా వివరించాడు. నిజానికి హను తన మొదటి సినిమా తోనే తానేమిటో ప్రూవ్ చేసుకున్నడు. "అందాల రాక్షసి" లాంటి సాఫ్టెస్ట్ కథని తీసి తన టేస్ట్ చూపించాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా ఒక అద్బుతమైన ఫీల్ ని చూపించటం లో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నాని హీరోగా తీసిన "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ" నాని కెరీర్ లొనే మరిచి పోలేని సినిమా. ఇక ఈసారి కూడా తన స్టైలాఫ్ మేకింగ్ ని మూడో కోణం లో కూడా తెరమీదకి బాగానే ఎక్కించే ప్రయత్నం చేసాడు కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేక పోయాడు.

    మూసలో పడి పోవటం

    మూసలో పడి పోవటం

    కొన్ని సీన్లులాగ్ అవటం, ఇంటర్వెల్ వరకూ.., ఆతర్వాత మరో పదీ పదిహేను నిమిషాల పాటు బాగానే సాగిన సినిమా ఒక్క సారి చల్లబడి పోతుంది. సినిమా అంటే కేవలం స్తైలిష్ గా తీసే ఫైట్లు మాత్రమే కాదు అన్న విషయం హను లాంటి దర్శకుడు కూడా గుర్తించకపోవటం, తానూ మూసలో పడి పోవటం శోచనీయమే.

    ప్లస్ లు.., మైనస్ లు

    ప్లస్ లు.., మైనస్ లు

    ప్లస్ లు: ట్విస్ట్ లతో కూడిన కథ
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    స్టార్ కాస్ట్
    సినిమాటోగ్రఫీ
    యాక్షన్ సీన్స్

    మైనస్ లు : దర్శకత్వం

    ఎడిటింగ్

    స్క్రీన్ ప్లే

    అబద్దం అతికీఅతకనట్టుంది

    అబద్దం అతికీఅతకనట్టుంది

    సినిమా ఎంత స్టైలిష్ గా అనిపించినా కథ ని సాగదీయటం కాస్త చిరాకు తెప్పించే విషయం. యాక్షన్ కింగ్ గా అర్జున్ నటన, నితిన్ స్టలిష్ లుక్ ఖచ్వ్చితంగా ప్లస్ అవుతాయి. ఈ సినిమా తరవాత అర్జున్ కి విలన్ గా తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే ఎక్కే ఈసినిమా కొంతలో కొంత మాస్ ని కూడా మెప్పించగలిగితే ఈ వారం హిట్ ల జాబితాలో చేరొచ్చు... మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలీ అంటే... అబద్దం అతికీఅతకనట్టుంది.

    English summary
    Arjun and Nithiin are the only positives in the movie. Other than that the plot of the movie are below average.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X