Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్ ‘లై’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
యూత్‌స్టార్ నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి).
హైదరాబాద్: యూత్‌స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి).
ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి ఈరోజు(ఏప్రిల్ 19) తన పుట్టినరోజును యూనిట్ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా డైరెక్టర్ హను రాఘవపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మా చిత్రం షూటింగ్ అమెరికాలోని డిఫరెంట్ లొకేషన్స్‌లో జరుగుతోంది. జూన్ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్, లాస్ ఏంజిలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది'' అన్నారు.
యూత్‌స్టార్ నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, డాన్స్: రాజు సుందరం, ఫైట్స్: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.