Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్కకు వచ్చిన సమస్యే నిత్యామీనన్ కు, ముఖ్యంగా నడుం దగ్గర? ,స్ట్రిక్టుగా చెప్పారు
హైదరాబాద్ : హీరోయిన్స్ కు పెద్ద సమస్య బరువు పెరగటం. ఎప్పుడైతే బరువు పెరుగుతారో వాళ్లకు వేషాలు తగ్గిపోతూంటాయి. అయితే టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గాలని దర్శక,నిర్మాతలు సూచిస్తారు. ఎందుకంటే సినిమా కోట్లతో కూడుకున్న వ్యవహారం. అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. రీసెంట్ అనుష్క బరువు పెరిగి బాహుబలికి సమస్య తెచ్చి పెట్టింది. ఇప్పుడు నిత్యామీనన్ సైతం అదే దారిలో వెళ్లటం ఆమెకు సమస్యగా మారింది.
హీరోయిన్స్ అంటే స్లిమ్‌గా ఉండాల్సిందే. తమిళం మాటేమో గానీ తెలుగులో నాజూకైన హీరోయిన్స్ కే గుర్తింపు. కాస్త ఒళ్లు చేసినా అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుంది. అందుకే జీరో సైజ్, వ్యాయామాలూ.. అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిత్యమీనన్ మాత్రం 'బొద్దుగా ఉంటే తప్పేంటి?' అని అడుగుతూ గెంటుకొచ్చేసింది. కానీ ఇప్పుడు తప్పేటట్లు లేదు.
''నా శరీరం నాకు సౌకర్యంగా ఉంటే చాలు. కాస్త లావుగా ఉంటే అవకాశాలు తగ్గిపోతాయనే భయాలు నాకు లేవు. కావాలంటే పాత్ర కోసం స్లిమ్ అవ్వమంటే అవుతా. కానీ పనిగట్టుకొని తగ్గను. లావుగా ఉన్నా ప్రతిభ ఉంటే కచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అలా పేరు తెచ్చుకొన్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు'' అని చెప్పే నిత్యమీనన్ ఇప్పుడు తప్పనిసరిగా బరువు తగ్గాల్సిన పరిస్దితికి వచ్చింది.
మొదటి సినిమా 'అలా మొదలైంది' తోనే తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నిత్యా మీనన్. నిత్యా మీనన్ చేసే సినిమాలన్నిటిలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తారు. అలాగే చేసే సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అవుతుంటాయి కూడా.
రీసెంట్ గా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ లో కనిపించిన కేరళ కుట్టి నిత్యామీనన్ . సుదీప్ సరసన ముడింజా ఇవన పుడి చిత్రంలోనూ, విక్రమ్‌కు జంటగా ఇరుమురుగన్ (ఇంకొకడున్నాడు) లోనూ కనిపించి అలరిచించిన ఈ బహు బాషా నటి ఇప్పుడు వెంకటేష్ సరసన ఓ చిత్రం కమిటైంది.
వెంకీ కొత్త సినిమాలో ఓ డిఫెరెంట్ క్యారక్టరైజేషన్ తో నడిచే హీరోయిన్ పాత్రకు నిత్యా మీనన్ ను ఎంచుకున్నట్లు సమాచారం. 'నేను శైలజా' చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నిత్యానే వెంకీ కి జతగా కనిపించనుంది. వినోదాత్మకంగా సాగే ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ చిత్రం కోసం ఆమె బరువు తగ్గాల్సిన అవసరం వచ్చిందిట.
జనతాగ్యారేజ్ లోనే కాస్త ఆడ్ గా ఉన్న ఆమెను నడుం వద్ద కొవ్వు కరిగించే పనిలో పడమని దర్సక,నిర్మాతలు సూచించారట.ఆడవాళ్లూ మీకు జోహార్లూ టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో ఆమె మరింత యంగ్ గా, నాజాకుగా కనపడాల్సిన అవసరం ఉందిట. దాంతో తప్పనిసరిగా బరువు తగ్గించాలని ఆమె నిర్ణయించుకుని ఆ పనిలో ఉందిట.
'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమల, వెంకటేష్‌తో ఓ కామెడీ సినిమా చేయనున్నారట. ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి, ఓ యువతికి మధ్యన జరిగే సరికొత్త ప్రేమకథతో ఈ కామెడీ తెరకెక్కనుందని సమాచారం. వెంకీ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న 'సాలా ఖదూస్' తెలుగు రీమేక్ పూర్తవ్వగానే కిషోర్ తిరుమల సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.
నోరు కట్టుకోవాల్సిన పనిలేదు
బరువు తగ్గి స్లిమ్ అయితే మరిన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చునన్న ఉచిత సలహాలిస్తున్నారని, అవకాశాల కోసం నోరు కట్టుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు.ఇష్టమైన ఆహార పదార్థాలు తింటేనే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. అప్పుడే ముఖం కాంతులీనుతుందని అన్నారు నిత్యామీనన్ ఇంతకు ముందు జనతాగ్యారేజ్ సమయంలో. మరి ఇప్పుడు ఏమంటారో చూడాలి.
బొద్దుగా ముద్దుగా ఉంటా
అసలు అందం కంటే ఆహారంలో ఆంక్షలు విధించుకుని స్లిమ్ అయ్యి అరువు అందాలను కొనితెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని నిత్యామీనన్ అంటున్నారు. తానింతే బొద్దుగా ముద్దుగా ఉంటానంటున్న ఈ భామ సమంతతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ సక్సెస్ తో తనపై తాను మరింత నమ్మకం పెంచుకుంది.
పీలగా ఉంటేనే హీరోయిన్ అంటారా
"సినిమా హీరోయిన్లంటే సన్నగా పీలగా వుండాలా? అలా రూలేమైనా ఉందా? పాతతరం హీరోయిన్స్ ని చూడండి ... ఎవరైనా సన్నగా ఉండేవారేమో" అంటోంది నిత్యా. వేషాల కోసం తిండి మానేసి బరువు తగ్గించుకోవడం తన వల్ల కాని పనని చెప్పింది. 'అవసరం అయితే అలాంటి వేషాలైనా వదులుకుంటాను కానీ, తిండిని మాత్రం వదులుకోన'ని తేల్చి గతంలో చాలా సార్లు చెప్పింది.
అప్పటినుంచే పెద్ద ఆఫర్స్
మణిరత్నం చిత్రం 'ఓ కాదల్ కణ్మణి' (ఓకే బంగారం) చిత్రం వరకూ తెమిళంలో అంతగా పేరులేని నాయకి నిత్యామీనన్. ఆ చిత్ర విజయం మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతకు ముందు వరకూ చిన్న హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతుండడం గమనార్హం.
పొట్టి అని కూడా విమర్శించారు
నిత్యామీనన్ సాధారణ పొడుగు కాస్త తక్కువే. దాన్ని కొరతగా చూపేవాళ్లూ లేక పోలేదు. ఇంతకు ముందు పొట్టి, లావు అని వంకలు పెట్టిన వారే ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకోవడంతో నిత్యామీనన్ మంచి నటి అని అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారని పేర్కొంది.
వాటిని తెరపై చూసుకుంటే..
''నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒక సినిమాకీ మరో సినిమాకీ మధ్య ఏమాత్రం పోలిక లేకుండా విభిన్నమైన పాత్రల్ని పోషించాను. వాటిని తెరపై చూసుకొంటుంటే ఒక నటిగా ఎంతో సంతృప్తి కలుగుతోంది.
లివ్ ఇన్ రిలేషన్ షిపే కే నా ఓటు
ముక్కూ మోహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సర్దుకుపోయే బదులు.. నచ్చిన వాడితో హాయిగా సహజీవనం చేస్తే తప్పేంటని అంటోంది నిత్యా. 'లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. అరెంజ్డ్ మ్యారేజెస్ లో ఆ ఛాన్స్ ఉండదు. అందుకే నా మద్దతు దానికే' అంటోంది నిత్యా.
హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే
"దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే ఉందని, హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అంటూ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్.
తెలుగు వారి కోసం మారాను
''తెలుగులోనే నాకు ఎక్కువ విజయాలు లభించాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ప్రత్యేకం. నన్ను, నా పాత్రల్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇంత ఆదరణ వేరే ఎక్కడా లేదు. అందుకే ప్రతి పాత్రనీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొనే ఎంచుకొంటున్నా. కమర్షియల్ చిత్రాల్లో భాగం కావడం వెనక కారణం కూడా అదే. తెలుగు ప్రేక్షకుల కోసం నన్ను నేను చాలా మార్చుకొన్నా అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్.
అన్ బిలీవబుల్ అని సమంత మెసేజ్
సమంత నేను జనతాగ్యారేజ్ లో రీసెంట్ గా చేసాం. ననా కెరీర్ మొదటి నుంచే సమంత నన్ను పొగుడుతూ ఉంటుంది. నా యాక్టింగ్, నా వర్క్ అంటే తనకి ఎంతో ఇష్టం. ఇప్పుడు కూడా ఓకే బంగారం చూసి అన్ బిలీవబుల్ అని మెసేజ్ చేసింది. సత్యమూర్తి టైంలో ఇద్దరం కలిసి పనిచేశాం.. ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాం. యాక్టర్స్ గా ప్రొఫెషనల్ గా ఇద్దరికీ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ బయట ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం.
నా వేవ్ లెంగ్త్ కు కనెక్ట్ కావాలి
నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అన్నీ చెయ్యగలగాలి, అలా చేయ్యలేదు అంటే నాకో ముద్ర పడిపోతుంది. నా పరంగా నేను అన్నీ భావాలను ఎక్స్ ప్రెస్ చేయడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా లవ్ ని రకరకాలుగా మనం చెప్పచ్చు. ఎలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చినా నేను ముందు డైరెక్టర్ దీన్నెలా చూపిస్తాడు అని ఆలోచిస్తాను. నా వేవ్ లెంగ్త్ కి డైరెక్టర్ కనెక్ట్ అయితే సినిమా చేసేస్తాను.
పవన్ చేసిన సినిమా ఇష్టం
త్రివిక్రమ్ సినిమాల్ని నేను బాగా ఇష్టపడతాను. ఆయన చేసిన చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని చూసి బాగా ఆస్వాదించాను. వాణిజ్య నేపథ్యంతో కూడిన చిత్రాలే అయినా... వాటిలో బలమైన అంశాన్ని చెబుతుంటారాయన.