» 

పవన్ కళ్యాణే కాదు...మేం కూడా

Posted by:

హైదరాబాద్ : అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్...ఎన్నారై గా కనిపించి అలరిస్తాడు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు మన హీరోలందరి దృష్టీ ఆ ఎలిమెంట్ పై పడింది. ఇప్పటికే రామ్ తన తాజా చిత్రం పండగ చేస్కో లో ఎన్నారై గా కనిపిస్తూండగా... ఇప్పుడు నితిన్ కూడా అదే రూటులో ప్రయాణిస్తున్నాడని తెలుస్తోంది. అతని తాజా చిత్రం 'చినదాన నీ కోసం' లో నితిన్ ...విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడిగా నితిన్‌ తెరపై సందడి చేయబోతున్నాడని సమచారం.

ఇక వరస పెట్టి లవ్ స్టోరీలు చేసుకుంటూ పోతున్నాడు...ఆ చక్కని, చిక్కని ప్రేమకథల్లో చక్కగా ఇమిడిపోతున్నాడు నితిన్‌. 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ఎటాక్‌' చిత్రాల్లో ఈ జనరేషన్ లవర్ గా సందడి చేశాడు. ఇప్పుడు ఏకంగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా ముద్రపడిన కరుణాకరన్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'చినదాన నీ కోసం' పేరుతో శ్రావణ సినిమాస్‌ పతాకంపై ఆ చిత్రం రూపొందుతోంది. మిస్తీ హీరోయిన్.

నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని తెలిపారు.

త్వరలో బార్సిలోనాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అక్కడే 35 రోజులపాటు చిత్రీకరణ జరుపుతున్నట్టు నితిన్‌ తెలిపారు. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

Read more about: tollywood, nitin, karunakaran, pawan kalyan, టాలీవుడ్, నితిన్, కరుణాకరన్, పవన్, అత్తారింటికి దారేది
English summary
Nitin’s new movie ‘ Chinnadana Nee Kosam’ with Mishti Chakraborthy in the female lead directed by Karunakaran has completed its 2 shooting schedules . The movie unit is right now at Barcelona,Spain for fresh shooting schedule. This one month schedule is for shooting song sequences and some important scenes in Spain.The total shooting of the movie will be completed with this schedule
Please Wait while comments are loading...