Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓ ఇంటివాడు కాబోతున్న నితిన్, త్వరలో పెళ్లి!
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నితిన్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇప్పటికే 31 సంవత్సరాలు క్రాస్ అయిన నితిన్‌కు త్వరగా పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు చూస్తున్నారు. తగిన జోడీ కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే కొందరు అమ్మాయిలను చూసినా....ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మరి కొన్ని రోజుల్లోనే నితిన్ పెళ్లి వార్త వినబోతున్నాం.
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన నితిన్ తొలి సినిమాతోనే విజయం అందుకోవడంతో పాటు వెంటనే దిల్, సై లాంటి వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు సరైన హిట్టు లేక సతమతం అయిన నితిన్....ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హాట్రిక్ అందుకున్నాడు.
ప్రస్తుతం నితిన్...కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రేమసాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌతం మీనన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని తర్వాత గౌతం మీనన్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఖరారైంది. 2015లో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది.