»   » నితిన్ కొత్త చిత్రం 'దిల్ వాలా'

నితిన్ కొత్త చిత్రం 'దిల్ వాలా'

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఇష్క్ చిత్రం హిట్ తో మంచి జోరు మీదున్న నితిన్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ లో వీడు తేడా చిత్రం చేసిన దర్సకుడు చిన్ని కృష్ణ ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నాడు. నితిన్ కెరీర్ లో మూడో హిందీ టైటిల్ ఇది. మొదట వినాయిక్ డైరక్షన్ లో దిల్,రెండోది ఇష్క్,ఇప్పుడు దిల్ వాలా. ఇక దిల్ వాలా చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఇక ఇప్పటికే నితిన్ హీరోగా ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై 'కొరియర్‌బోయ్ కళ్యాణ్' అనే చిత్రం ప్రారంభమైంది. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తమిళంలో 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో రూపొందిస్తున్నారు. ముఖ్య పాత్రలో జై, సంతానం, వి.టి.వి గణేష్ నటిస్తుండగా మిగతా పాత్రల ఎంపిక జరగనుంది.

గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ -''భాషలకు అతీతంగా అందరి అభినందనలు అందుకునే సినిమా ఇది. ప్రేమ, హాస్యం, యాక్షన్ అన్నీ ఈ కథలో ఉంటాయి. గాయకుడు కార్తీక్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జై సంతానం, నిటివి గణేశ్ కీలక పాత్రలు పోషిస్తారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది'' అని తెలిపారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కి త్వరలోనే వెళ్లనున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నిర్మాత: గౌతమ్‌వాసుదేవ మీనన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

English summary
‎" Dilwala " is the title of Nitin ’s next movie in the production of Bellamkonda Suresh. This film will be directed by Chinni Krishna who made his debut as director with " Veedu Theda". Nitin is currently acting as ‘Courier Boy Kalyan’ in Gowtam Menon production.
Please Wait while comments are loading...